తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announced Trimbakeshwar Tour From Hyderabad City

IRCTC Trimbakeshwar Tour: త్రయంబకేశ్వర్ ట్రిప్ - ఇదిగో IRCTC తాజా ప్యాకేజీ

HT Telugu Desk HT Telugu

05 January 2023, 17:18 IST

    • IRCTC Tour Packages From Hyderabad: త్రయంబకేశ్వర్ తో పాటు షిర్డీ వెళ్లే వారికోసం ఐఆర్‌సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. 'సాయి శివం' పేరుతో అందుబాటు ధరలో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. టూర్ కు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
త్రయంబకేశ్వర్ ఆలయం
త్రయంబకేశ్వర్ ఆలయం (facebook)

త్రయంబకేశ్వర్ ఆలయం

Trimbakeshwar Tour From Hyderabad: ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు.. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటున్నాయి. కొన్ని ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి.. ఈ ప్యాకేజీలు ఉపయోగపడుతున్నాయి. కుటుంబంతో కలిసి వెళ్లి చూసి రావొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐఆర్‌సీటీసీ టూరిజం వాళ్లు తీసుకెళ్లి.. తీసుకొస్తారు. అయితే తాజాగా షిర్డీతో పాటు త్రయంబకేశ్వర్ వెళ్లే వారికోసం 'SAI SHIVAM' పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

TS EAPCET Hall Tickets : టీఎస్ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

CM Revanth Reddy Notices : అమిత్ షా ఫేక్ వీడియో కేసు, సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు నోటీసులు

Summer Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, మరిన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి!

AP TS Weather Updates: మండుతున్న ఎండలు, తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో జనం విలవిల

మూడు రాత్రులు, నాలుగు రోజుల ప్యాకేజీ ఇది. నాసిక్ తో పాటు షిరిడీ చూసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి ప్రయాణం మెుదలవుతుంది. ప్రస్తుతం ఈ టూర్ జనవరి 13వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి శుక్రవారం తేదీల్లో ఆపరేట్ చేస్తున్నారు. పర్యటన షెడ్యూల్ కింది విధంగా ఉంటుంది.

Day 1 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 06:50 గంటలకు ట్రైన్ ఉంటుంది. రైలు నెం. 17064, అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. రాత్రంతా జర్నీ ఉంటుంది.

Day 2 : ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిరిడీ ఆలయం సందర్శన ఉంటుంది. సాయంత్రం షిరిడీలో తిరగొచ్చు. రాత్రికి అక్కడే చేస్తారు.

Day 3 : షిరిడీలో హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. నాసిక్ లోని త్రయంబకేశ్వర్ కు వెళ్తారు. పంచవటి దర్శనం ఉంటుంది. నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.

Day 4 : 08:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ ధరలు...

ఇక టూర్ ప్యాకేజీ ధర చూసుకుంటే.. స్టాండర్డ్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4940, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4200 చెల్లించాల్సి ఉంటుంది. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11730, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6550, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4910గా ధర నిర్ణయించారు. కంఫర్ట్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6630, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5890 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లలకు ప్రత్యేక ధరలు అందుబాటులో ఉన్నాయి. వివరాల కోసం కింద ఇచ్చిన జాబితాను చెక్ చేసుకోవచ్చు.

టికెట్ ధరలు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ఈ టూర్ ప్యాకేజీ బుకింగ్ తో పాటు ఇతర వివరాలను చెక్ చేసుకోవచ్చు. మిగతా ప్యాకేజీల వివరాలను కూడా పొందవచ్చు.