తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Munnar Tour: మనసు దోచే 'మున్నార్' అందాలు.. ఇదిగో Irctc తాజా ప్యాకేజీ

IRCTC Munnar Tour: మనసు దోచే 'మున్నార్' అందాలు.. ఇదిగో IRCTC తాజా ప్యాకేజీ

HT Telugu Desk HT Telugu

30 December 2022, 8:18 IST

    • Hyderabad Munnar Tour Package: మున్నార్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..?అయితే మీ కోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
 హైదరాబాద్ - మున్నార్ ట్రిప్
హైదరాబాద్ - మున్నార్ ట్రిప్ (twitter)

హైదరాబాద్ - మున్నార్ ట్రిప్

IRCTC Tourism Munnar Tour Package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి కేరళలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ. ఈ ట్రిప్ లో మున్నార్ , అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల

Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్

Mlc Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, బెయిల్ నిరాకరించిన కోర్టు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Hyderabad kerala hills tour: 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ జనవరి 17వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. టూర్ షెడ్యూల్ చూస్తే కింది విధంగా ఉంటుంది....

Day 01 Tuesday: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day 02 Wednesday: రెండోరోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే బస చేస్తారు.

Day 03 Thursday: ఉదయమే ఎర్నాకులం నేషనల్ పార్క్ కు వెళ్తారు. తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యాం, ఎకో పాయింట్ కు వెళ్తారు. రాత్రి కూడా మున్నార్ లోనే బస చేస్తారు.

Day 04 Friday: హోటల్ నుంచి అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... backwater ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు.

Day 05 Saturday: హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు(Train No. 17229, Sabari Express ) తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

Day 06 Sunday: మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ ధరలు

hyd munnar tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 31,430 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 18,190 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14,800గా ఉంది. కంఫార్ట్ క్లాస్(3A) లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి.

 మున్నార్ ట్రిప్ ధరల వివరాలు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.