తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Ramayan Yatra : గంగా రామాయణ్ యాత్ర పూర్తి వివరాలివే

IRCTC Ramayan Yatra : గంగా రామాయణ్ యాత్ర పూర్తి వివరాలివే

HT Telugu Desk HT Telugu

09 November 2022, 22:22 IST

    • Hyderabad To Ganga Ramayan Yatra : ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి గంగా రామాయణ్ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ.. 5 రాత్రులు, 6 రోజులు ఉంటుంది.
గంగా రామాయణ్ యాత్ర
గంగా రామాయణ్ యాత్ర

గంగా రామాయణ్ యాత్ర

హైదరాబాద్(Hyderabad) నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. AYODHYA, NAIMISHARANYA, PRAYAGRAJ, SARNATH, VARANASI, ప్రాంతాలు కవర్ అవుతాయి. గంగా రామాయణ్ యాత్ర (Ganga Ramayan Yatra)పేరిట ఈ ప్యాకేజీ ఉంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. విమానంలో పర్యాటకుల్ని తీసుకెళ్లి అయోధ్య, నైమీశరణ్య, ప్రయాగ్‌రాజ్, సార్‌నాథ్, వారణాసిలోని పుణ్యక్షేత్రాలను చూపిస్తారు. నవంబర్ 17న ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల

Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్

Mlc Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, బెయిల్ నిరాకరించిన కోర్టు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Day 1 : హైదరాబాద్ విమానాశ్రయం(Hyderabad Airport) నుండి ఉదయం 9:30 గంటలకు బయలుదేరాలి. వారణాసి విమానాశ్రయానికి 11:25 వరకు వెళ్తారు. ఆ తర్వాత హోటల్‌ వెళ్తారు. హోటల్‌లో భోజనం చేసి.. కాశీ దేవాలయం, గంగా ఘాట్(Ganga Ghat) సందర్శనకు వెళ్లాలి. వారణాసి(Varanasi)లో రాత్రి బస చేస్తారు.

Day 2 : సారనాథ్(SARNATH) సందర్శనకు వెళ్లాలి. మధ్యాహ్నం తిరిగి వారణాసికి వస్తారు. BHU ఆలయాన్ని సందర్శిస్తారు. ఘాట్‌లను సందర్శించడం లేదా సొంతంగా షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. వారణాసిలో రాత్రి బస చేయాలి.

Day 3 : హోటల్ నుంచి చెకౌట్ చేస్తారు. ఆనంద్ భవన్, అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమం సందర్శనకు వెళ్తారు. సాయంత్రం అయోధ్య(Ayodhya)కు బయలుదేరుతారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. రాత్రికి అయోధ్యలోనే బస చేస్తారు.

Day 4 : అయోధ్య ఆలయాన్ని సందర్శించాలి. మధ్యాహ్నానికి హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి లక్నోకు వెళ్లాలి. అక్కడ హోటల్‌లో దిగాలి. లక్నోలో రాత్రి బస చేస్తారు.

Day 5 : పూర్తి రోజు నైమిశరణ్యాన్ని దర్శిస్తారు. సాయంత్రం తిరిగి లక్నోకు వెళ్తారు. లక్నోలోనే రాత్రి బస చేస్తారు.

Day 6 : బారా ఇమాంబరా, అంబేడ్కర్ మెమోరియల్ పార్క్‌ సందర్శన ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు లక్నో విమానాశ్రయంలో డ్రాప్ చేస్తారు. 07:35కి ఫ్లైట్ ఉంటుంది. అక్కడ నుంచి రాత్రి 9:40 వరకు హైదరాబాద్ కు వస్తారు. ఇక్కడితో టూర్ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ గంగా రామాయణ్ యాత్ర టూర్ ప్యాకేజీ(IRCTC Ganga Ramayan Yatra) ధర చూసుకుంటే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.28,200గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.29,900 చెల్లించాలి. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.36,8500 ఉంటుంది. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, రెండు రాత్రులు వారణాసిలో, ఒక రాత్రి అయోధ్యలో, రెండు రాత్రులు లక్నోలో బస చేయాలి. బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్(Travel Insurance) కవర్ అవుతాయి.