తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Traffic Alert : ఈ రోడ్లలోకి రావొద్దు

Hyderabad Traffic Alert : ఈ రోడ్లలోకి రావొద్దు

HT Telugu Desk HT Telugu

13 June 2022, 11:21 IST

    • హైదరాబాద్ ట్రాఫిక్‌ రద్దీకి సంబంధించి ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ అలెర్ట్ జారీచేశారు.
నిరసనల సందర్భంగా హైదరాబాద్ పోలీసుల బందోబస్తు (ఫైల్ ఫోటో)
నిరసనల సందర్భంగా హైదరాబాద్ పోలీసుల బందోబస్తు (ఫైల్ ఫోటో) (ANI)

నిరసనల సందర్భంగా హైదరాబాద్ పోలీసుల బందోబస్తు (ఫైల్ ఫోటో)

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు నెక్లెస్ రోడ్ నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ అలెర్ట్ జారీచేశారు.

ట్రెండింగ్ వార్తలు

Siddipet Accident : పెళ్లి రోజే విషాదం, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Youth Cheated Producer : ఒక్క ఛాన్స్ అంటూ నిర్మాత చుట్టూ ప్రదక్షిణాలు, అవకాశం చిక్కగానే బంగారంతో జంప్

Cyber Crime : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం, సిద్దిపేట యువతికి రూ.16 లక్షలు టోకరా - ఏపీలో సైబర్ కేటుగాడు అరెస్ట్

Mlc Dande Vithal : ఎమ్మెల్సీగా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు, సుప్రీంలో సవాల్ చేస్తానంటోన్న దండే విఠల్

‘ఈరోజు 13 జూన్ 2022న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిరసన ప్రదర్శన పిలుపు కారణంగా ఆయకార్ భవన్ సమీపంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కార్యాలయం ముందు ఈ క్రింది ప్రదేశాలలో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది.

- ఖైరతాబాద్ జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, చింతల్‌బస్తీ, లక్డీకపూల్, బషీర్‌బాగ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ జంక్షన్, అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, పీసీఆర్ జంక్షన్, లిబర్టీ జంక్షన్, నారాయణగూడ, సెక్రటేరియట్/ బీఆర్కే భవన్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఉంటుంది.

ప్రయాణికులందరూ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా ఉండవలసిందిగా అభ్యర్థించడమైనది..’ అని జాయింట్ కమిషనర్ కోరారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని, అక్రమ కేసులు బనాయిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ పేరుతో పిలుస్తోందని చెబుతూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నెక్లెస్ రోడ్ చేరుకున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పార్టీ నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు.ht

 

 

 

టాపిక్