తెలుగు న్యూస్  /  Telangana  /  Extension Of Visakha-kachiguda Express To Mahabubnagar

Train Extension: విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు మహబూబ్‌నగర్‌ వరకు పొడిగింపు

HT Telugu Desk HT Telugu

19 May 2023, 8:52 IST

    • Train Extension: విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇకపై మహబూబ్‌నగర్‌ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.  మే 20వ తేదీ నుంచి ఈ రైలును మహబూబ్‌నగర్‌ వరకు పొడిగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. 
విశా‌ఖపట్నం కాచిగూడ రైలు పొడిగింపు
విశా‌ఖపట్నం కాచిగూడ రైలు పొడిగింపు

విశా‌ఖపట్నం కాచిగూడ రైలు పొడిగింపు

Train Extension: ట్రైన్‌ నంబర్ 12861/12862 విశాఖపట్నం - కాచిగూడ - విశాఖపట్నం రైలును ఇకపై మహబూబ్‌నగర్‌ వరకు నడుపుతారు. మహబూబ్‌ నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌, ఉందానగర్‌ ప్రజలకు రైలును పొడిగించడంతో ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. .

ట్రెండింగ్ వార్తలు

Siddipet District : సరిగ్గా చూసుకొని కొడుకు...! కొండగట్టు ఆలయానికి ఆస్తిని రాసిచ్చేందుకు సిద్ధమైన తండ్రి

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..

Arunachalam Tour : ఈ నెలలో 'అరుణాచలం' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? రూ. 7500కే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

TS Model School Results : తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి

మే 20 నుంచి కొత్త షెడ్యూల్ అమలులోకి వస్తుంది. కాచిగూడ తర్వాత ఈ రైలు ఉందానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ స్టేషన్లలో ఆగుతుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే వివరాల్ని గురువారం ప్రకటించింది.

విశాఖపట్నం నుంచి సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరే రైలు కాచిగూడకు మరుసటిరోజు ఉదయం 6.45కి, ఉందానగర్‌ 7.19, షాద్‌నగర్‌ 7.44, జడ్చర్ల 8.15, మహబూబ్‌నగర్‌కి ఉదయం 9.20కి చేరుతుంది. విశాఖ-కాచిగూడ మధ్య మిగిలిన స్టేషన్ల మధ్య రైలు వేళల్లో ఎలాంటి మార్పు లేదని ద.మ.రైల్వే తెలిపింది.

మహబూబ్‌నగర్‌ నుంచి సాయంత్రం 4.10 గంటలకు బయలుదేరే రైలు జడ్చర్ల 5.26కి, షాద్‌నగర్‌ 4.57, ఉందానగర్‌ 5.23, కాచిగూడ 6.10, విశాఖకు మరుసటిరోజు ఉదయం 6.50 గంటలకు చేరుకుంటుంది.

రైల్వే స్టేషన్లలో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్‌ ఔట్ లెట్స్‌

 

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 72 రైల్వే స్టేషన్లలో 77 ‘వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ " ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా చేతివృత్తులు, హస్తకళలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో 35 రైల్వే స్టేషన్లలో 37 ‘ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్’ 37 అవుట్‌లెట్‌లు ఏర్పాటైనట్లు వివరించారు.

సమాజంలోని అట్టడుగు వర్గాలకు మార్కెట్‌ను అందించడంతో పాటు అదనపు ఆదాయ అవకాశాలను కల్పించడం ద్వారా స్థానిక, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ పథకాన్ని ప్రవేశపెట్టింది.

2022-23 యూనియన్ బడ్జెట్‌లో ప్రకటించినప్పటి నుంచి ఈ కాన్సెప్ట్ ఊపందుకొని స్థానిక చేతివృత్తులకు తోడ్పాటు అందిస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలో, 'వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్' కాన్సెప్ట్‌ను మొదట ఆరు రైల్వే స్టేషన్లలో 30 రోజుల ట్రయల్‌గా ప్రవేశపెట్టారు.

ఈ ఔట్‌లెట్స్‌‌కు అద్భుతమైన స్పందన లభించడంతో, పైలెట్ ప్రాజెక్ట్ కింద జోన్‌లోని డెబ్బై రైల్వే స్టేషన్‌లలో అవుట్‌లెట్‌లు విస్తరించాయి. ప్రస్తుతం, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న 72 రైల్వే స్టేషన్‌లకు విస్తరించాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలలో స్థానిక ఉత్పత్తులకు అధిక ఆదరణ అందించే ‘వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్’ యొక్క 77 అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, గుడివాడ మొదలైన వాటితో సహా ముప్పై-ఐదు రైల్వే స్టేషన్‌లలో ఈ ఔట్‌లెట్స్‌ ఏర్పాటయ్యాయి. స్థానిక చేతివృత్తుల వారి జీవనోపాధి మరియు సంక్షేమానికి ప్రోత్సాహం లభిస్తుంది. కొన్ని ఉత్పత్తులలో సాంప్రదాయ కలంకారి చీరలు, స్థానిక నేత కార్మికుల చేనేతలు ఉన్నాయి. జనపనార ఉత్పత్తులు, అనుకరణ ఆభరణాలు, చెక్క హస్తకళలు, గిరిజన్ ఉత్పత్తులు, ఊరగాయలు, మసాలా పొడులు, పాపడాలు వంటి స్థానిక వంటకాలు, షెల్ పెయింటింగ్స్ మరియు రైస్ ఆర్ట్ మొదలైనవి రైల్వే స్టేషన్లలో విక్రయిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్లో చేతితో పెయింట్ చేసిన చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన 'కలంకారి' వస్త్రాలను విక్రయిస్తున్నారు. కలంకారి కళలో రెండు విలక్షణమైన శైలులు ఉన్నాయని, శ్రీకాళహస్తి శైలి, మచిలీపట్నం శైలి వస్త్రాలను స్టేషన్లలో విక్రయిస్తున్నారు. స్థానిక నేత కార్మికులు ప్రజలకు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించడానికి అనుమతిస్తుంది. ఈ అవుట్‌లెట్‌లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి రైల్వే స్టేషన్‌లకు వచ్చే ప్రయాణీకులలో కలంకారి కళను మరింత ప్రాచుర్యం పొందేందుకు సహాయపడుతున్నాయని రైల్వే వర్గాలు వివరించాయి.

‘వన్ స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌’ పథకం స్థానిక కళాకారులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు గొప్ప అవకాశం కల్పిస్తుందని జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. ప్రయాణీకులకు చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు రైల్వే స్టేషన్లు సరైన విక్రయ కేంద్రాలని అభిప్రాయపడ్డారు.