తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Encroachments : చెరువులను మింగేశారు.. 134 ఖతమ్.. మిగిలినవి 51 మాత్రమే!

Encroachments : చెరువులను మింగేశారు.. 134 ఖతమ్.. మిగిలినవి 51 మాత్రమే!

HT Telugu Desk HT Telugu

27 November 2022, 17:13 IST

    • Hyderabad : భాగ్యనగరంలో చెరువులు భారీగా ఆక్రమణలకు గురైనట్టుగా తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఎన్జీటీకి చెప్పింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీటీ(NGT)కి నివేదిక సమర్పించింది. జీడిమెట్ల చెరువుగా ప్రసిద్ధి చెందిన ఫాక్స్ సాగర్, హైదరాబాద్‌లోని అతిపెద్ద సరస్సులలో ఒకటి. కొంపల్లి-కుత్బుల్లాపూర్ ప్రాంతాలతోపాటుగా చుట్టుపక్కల నివసించే స్థానికులకు పిక్నిక్ స్పాట్‌గా వస్తుంటారు. ఈ సరస్సు మొత్తం 1,014 అక్రమ నిర్మాణాలతో భారీగా ఆక్రమణకు గురైంది. నగరంలో అత్యధికంగా ఆక్రమణలకు గురైన మూడో సరస్సుగా ఉంది. ఫాక్స్ సాగర్ మాత్రమే ఆక్రమణలకు గురైందని అనుకోడానికి లేదు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలో 134 చెరువులు ఆక్రమణకు గురైనట్లు ప్రభుత్వం చెప్పింది. ఈ సరస్సుల చుట్టూ 14,061 ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు

Youth Cheated Producer : ఒక్క ఛాన్స్ అంటూ నిర్మాత చుట్టూ ప్రదక్షిణాలు, అవకాశం చిక్కగానే బంగారంతో జంప్

Cyber Crime : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం, సిద్దిపేట యువతికి రూ.16 లక్షలు టోకరా - ఏపీలో సైబర్ కేటుగాడు అరెస్ట్

Mlc Dande Vithal : ఎమ్మెల్సీగా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు, సుప్రీంలో సవాల్ చేస్తానంటోన్న దండే విఠల్

Koheda Gutta ORR : ఓఆర్ఆర్ పక్కనే ఉన్న కోహెడ గుట్టను చూసొద్దామా..! వ్యూపాయింట్ అస్సలు మిస్ కావొద్దు

30 చెరువుల్లో 85 శాతం కాగా, 104 చెరువుల్లో 15 శాతం ఆక్రమించేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ 2022 నవంబర్ 22న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ నివేదికలో కూకట్‌పల్లి(Kukatpally), కుతుబుల్లాపూర్, సరూర్ నగర్(Saroor Nagar), షేక్‌పేట్, సెరిలింగంపల్లి, రాజేంద్రనగర్(Rajendranagar) పరిధిలోని అనేక సరస్సులు ఆక్రమణకు గురయ్యాయి.

ఒక్క కూకట్‌పల్లిలోన మైసమ్మ చెరువు(Mysamma Cheruvu) ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలోని 148 ఎకరాల్లో 1500కు పైగా అక్రమ కట్టడాలను గుర్తించారు. ఇక్కడ FTL చుట్టూ ఆక్రమణల నుండి రక్షించడానికి ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేశారు. బఫర్ జోన్(Buffer Zone) లేదా.. FTL జోన్‌లో ఏదైనా నిర్మాణం చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. ఈ 134 సరస్సుల చుట్టూ ఎఫ్‌టీఎల్‌లలో 8,718 ఆక్రమణ నిర్మాణాలు, బఫర్ జోన్‌లలో మరో 5,343 నిర్మాణాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. 51 చెరువులు ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా ఉన్నాయని నీటిపారుదల శాఖ తెలిపింది.

బహదూర్‌పురలోని మిలన్‌ ట్యాంక్‌(Milan Tank), జీడిమెట్లలోని ఫాక్స్‌ సాగర్‌, సరూర్‌ నగర్‌లోని పెద్ద ట్యాంక్‌, నాచారంలోని పెద్ద చెరువు, మల్కాజిగిరిలోని బండ చెరువులు అత్యంత ఆక్రమణలకు గురైన సరస్సుల్లో ఉన్నాయి. బండ్లగూడ(Bandlaguda)లోని సల్కం చెరువులోని 30 ఎకరాల ఎఫ్‌టీఎల్‌, షేక్‌పేటలోని బంజారా కుంటలోని 25 ఎకరాల ఎఫ్‌టీఎల్‌ను పూర్తిగా నివాస కాలనీలుగా మార్చారు.

2022 మార్చి 3న నీటి వనరుల చుట్టూ ఉన్న ఆక్రమణల తొలగింపు, హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న చెరువులు, ట్యాంకుల పునరుద్ధరణలో జాప్యాన్ని వివరించాలని నీటిపారుదల శాఖను, జిల్లా కలెక్టర్‌ను NGT ఆదేశించింది. నీటిపారుదల శాఖ తాజా సమాధానంలో 52 ట్యాంకుల చుట్టూ ఉన్న నిర్మాణాల యజమానులు/భూస్వాములకు తుది నోటిఫికేషన్ జారీ చేయగా, 105 ట్యాంకుల చుట్టూ ఉన్న నిర్మాణాల యజమానులు/భూస్వాములకు ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా తెలిపారు. మిగిలిన 28 ట్యాంకుల సరిహద్దులను తహశీల్దార్లు ఖరారు చేయాల్సి ఉందని, ఆ తర్వాత నోటీసులు జారీ చేస్తామని నీటిపారుదల శాఖ స్పందించింది.

ఆక్రమణలు చూస్తే..

కూకట్‌పల్లిలోని మైసమ్మ చెరువులో అత్యధిక ఆక్రమణలు ఉన్నాయి. మైసమ్మ చెరువు-1745, బహదుర్‌పుర మిరాలం చెరువు-1635, జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌-1014, సరూర్‌నగర్‌ పెద్ద చెరువు-841, నాచారం పెద్ద చెరువు-719, మల్కాజ్‌గిరి బండ చెరువు-667, రామంతపూర్‌ చిన్న చెరువు-555, మల్కాజ్‌గిరి (సఫిల్‌గూడ) నడిమి చెరువు-549, రామంతపూర్‌ చెరువు-468, మూసాపేట్‌ కాముని చెరువు-449, మల్కాజ్‌గిరి ముక్కిడి చెరువు-386, షేక్‌పేట షహతం చెరువు-370, రాయదుర్గంలోని దుర్గం చెరువు(Durgam Cheruvu)-281 ఆక్రమణలు జరిగినట్టుగా నివేదిక చెబుతోంది.