తెలుగు న్యూస్  /  Telangana  /  Election Commission Of India Schedule Issued For Teacher Mlc Elections

TS Teacher MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీ కసరత్తు.. షెడ్యూల్ జారీ

HT Telugu Desk HT Telugu

30 September 2022, 22:15 IST

    • Schedule for Teacher MLC elections in Telugu States: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదుకు షెడ్యూల్
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదుకు షెడ్యూల్

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదుకు షెడ్యూల్

Schedule for Teacher MLC elections: హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన ప్రక్రియ శనివారం నుంచి మొదలుకానుంది. ఈ మేరకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ప్రస్తుత ఎమ్మెల్సీ కే జనార్ధన్‌రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనున్నది. ఈ క్రమంలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు ఓటర్ల జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

CM Revanth Reddy On Notices : బీజేపీని ప్రశ్నిస్తే నోటీసులే, దిల్లీ పోలీసుల సమన్లపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

TS 10th Results 2024 : రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు, హెచ్.టి.తెలుగులో వేగంగా రిజల్ట్స్!

TS EAPCET Hall Tickets : టీఎస్ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

CM Revanth Reddy Notices : అమిత్ షా ఫేక్ వీడియో కేసు, సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు నోటీసులు

డీనోవా పద్ధతిలో ఓటరు జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్ ఇచ్చింది. దీని ప్రకారం గతంలో ఉన్న ఓటు హక్కుతో సంబంధం లేకుండా మళ్లీ ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటు హక్కు కోసం అర్హులైన ఉపాధ్యాయులు ఫారం-18 సమర్పించాల్సి ఉంటుంది.

ఓటుహక్కు కోసం శనివారం నుంచి నవంబర్‌ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. నవంబర్ 23న ఓటరు జాబితా ముసాయిదా ప్రకటిస్తారు. డిసెంబర్‌ 9 వరకు అభ్యంతరాలు, వినతులు తీసుకుంటారు. డిసెంబర్ 30న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారు.

ఏపీలోనూ నమోదు ప్రక్రియ....

Schedule for Teacher MLC elections in AP: ఆంధ్రప్రదేశ్ లోనూ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు ప్రక్రియకు ఈసీ ఆదేశించింది. 2023 మార్చి 29తో 6 ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ప్రకాశం, కడప టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు, ప్రకాశం, కడప, శ్రీకాకుళం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఎన్నికలకు అక్టోబరు 1 నుంచి ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది. నవంబర్ 23న ఓటర్ల జాబితా ముసాయిదా, డిసెంబరు 23న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్ర, ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబరు ఒకటో తేది నుంచి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్లు ఫారం-18, ఉపాధ్యాయులు ఫారం-19 పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటి స్వీకరణకు నవంబరు 7వ తేది వరకు గడువు ఉంటుంది. నవంబరు 23న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. ఆ రోజు నుంచి డిసెంబరు 9వ తేది వరకు దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబరు 30న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. చిత్తూరు- నెల్లూరు- ప్రకాశం నియోజకవర్గాల ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా విఠపు బాలసుబ్రహ్మణ్యం 2017లో ఎన్నికయ్యారు. వీరి ఆరేళ్ల పదవీ కాలం 2023 మార్చి 29వ తేదీతో ముగియనుంది. దీంతో మార్చి నెలాఖరులోగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

ఓటు నమోదుకు అర్హతలు…

త్వరలో జరిగే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికకు 2019 అక్టోబరు నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 10వ తరగతి అనంతరం దూరవిద్య ద్వారా డిగ్రీ చదివిన వారు ఓటు హక్కు పొందడానికి అనర్హులుగా ప్రకటించారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత మూడేళ్ల డిప్లమో కోర్సు చేసినా అనర్హులేనని అధికారులు ప్రకటించారు. పది తర్వాత, ఇంటర్‌, తర్వాత మూడేళ్ల డిగ్రీ చేసిన వారు రెగ్యులర్‌ విద్యా విధానంలో చదివి ఉండాలి. ఓటరు నమోదు దరఖాస్తుతో పాటు డిగ్రీ ధ్రువపత్రం, ఆధార్‌ కార్డు నకళ్లు సమర్పించాలి. వాటిని గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరించాలి. దరఖాస్తుపై కలర్‌ పాస్‌పోర్టు సైజు ఫొటో అతికించాల్స ఉంటుంది.

టాపిక్