తెలుగు న్యూస్  /  Telangana  /  Election Commission Notices To Komatireddy Rajagopal Reddy

EC Notices To Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఈసీ నోటీసులు

HT Telugu Desk HT Telugu

31 October 2022, 15:09 IST

    • Munugode By Election : మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉపఎన్నిక(Munugode Bypoll) దగ్గర పడుతున్న వేళ.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. రాజగోపాల్‌రెడ్డి(Rajagopal Reddy) సంస్థ నుంచి సుమారు రూ.5.24 కోట్లను స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 22 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఆ డబ్బులన్నీ.. మునుగోడు ఉపఎన్నికల్లో పంపిణీ చేయడం కోసమేనని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ తరహాలో భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్... ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ - ప్యాకేజీ వివరాలివే

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

TS DOST Notification 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

టీఆర్ఎస్ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం(Election Commission) స్పందించింది. రాజగోపాల్‌రెడ్డికి నోటీసు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు రిటర్నింగ్​ అధికారికి సమాచారం అందింది. టీఆర్ఎస్ ఫిర్యాదు(TRS Complaint)ను రాజగోపాల్​రెడ్డికి తెలపాలని పేర్కొంది.

మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి అక్రమంగా నగదు బదిలీ చేస్తున్నారని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు వ్యక్తిగత ఖాతాలు, పార్టీ నాయకులు, సంస్థలు, కంపెనీలకు భారీగా నగదు బదిలీ చేశారని ఈ మొత్తాలను వెంటనే సీజ్ చేయాలని పేర్కొంది. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) తన కుటుంబ సంస్థల నుంచి రూ.5.22కోట్ల రుపాయల నగదును మునుగోడు ఉప ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఓట్లను కొనుగోలు చేయడానికే నగదు బదిలీ చేశారని టీఆర్ఎస్‌ చెబుతోంది. మునుగోడు(Munugode)లో ఉన్న 22 బ్యాంకు ఖాతాలకు భారీగా నగదు బదిలీ చేశారని టిఆర్‌ఎస్ ఆరోపించింది.

సుషీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్‌ కంపెనీకి కోఠీ ఎస్‌బీఐ ఖాతా(SBI Account) నుంచి నగదు బదిలీ చేసినట్లు టీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. అక్టోబర్‌ 29వ తేదీన కాంపాస్ ఇంజనీరింగ్ కంపెనీ నుంచి కోటి రుపాయలు బదిలీ అయ్యాయని ఆరోపించారు. అక్కడి నుంచి బంజారా హిల్స్‌ ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా మునుగోడుకు చెందిన మేకల పారిజాతకు 28లక్షలు, మర్రిగూడకు చెందిన నీలా మహేశ్వర్‌కు 25లక్షలు, అక్షయ సీడ్స్‌ అండ్ పెస్టిసైడ్స్‌, ఫెర్టిలైజర్స్‌ సంస్థకు రూ.25లక్షలు బదిలీ అయినట్లు వివరించారు.

మునుగోడులో ఓట్ల(Munugode Votes) కొనుగోలుకు సుషీ ఇన్ ఫ్రా నుంచి 5. 22 కోట్లు బదిలీ అయ్యాయని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఓటర్లను కొనుగోలు చేయడానికి ఐదున్నర కోట్ల రూపాయల్ని తన కంపెనీ నుంచి పలు ఖాతాలకు మళ్లించినట్లు ఆధారాలతో సహా బయటపెట్టింది. నగదు అందుకున్న అకౌంట్లు పూర్తిగా మునుగోడు నియోజకవర్గ పరిధిలోనే ఉన్నట్లు టీఆర్ఎస్(TRS) వెల్లడించింది. ఐదు కోట్ల 22 లక్షల రూపాయల్లో సుషీ ఇన్ఫ్రా నుంచి ఈ నెల 18వ తేదీన కోటిన్నర రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశారు. వాటిలో పబ్బు అరుణ ఖాతాలోకి యాభై లక్షలు, పబ్బు రాజు గౌడ్ ఖాతాలోకి యాభై లక్షలు, పబ్బు రాజు గౌడ్ కే చెందిన మరో అకౌంట్ కు 50 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశారని టీఆర్ఎస్ పార్టీ అంటోంది.

అక్టోబర్‌ 14వ తేదీన సుషీ ఇన్ ఫ్రా నుంచి రెండు కోట్లు వివిధ ఖాతాల్లోకి వెళ్లాయి. కాసర్ల విష్ణువర్థన్ రెడ్డికి రూ.16లక్షలు, కే.విజయవర్థన్ రెడ్డికి రూ.16 లక్షలు, కేఎస్ఆర్ ట్రేడింట్ అండ్ కో సంస్థకు రూ.16 లక్షలు, ఏ.నవ్యశ్రీ, కె.వెంకటరమణ, దిండు భాస్కర్, పోలోజు రాజ్ కుమార్, దిండు యాదయ్య, శ్రీనివాస టెంట్ హౌజ్, డి.దయాకర్ రెడ్డి, తిరుమల మిల్క్ ప్రాడక్ట్స్, శివ కుమార్ బుర్రా, ఉబ్బు సాయి కిరణ్, మణికంఠ బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్, టంగుటూరి లిఖిత ఎకౌంట్లకు ఒక్కొక్క ఎకౌంట్ కు 16 లక్షల చొప్పున ట్రాన్స్ ఫర్ అయ్యాయి.

అదే రోజు చింతల మేఘనాథ్ రెడ్డి అనే మరో వ్యక్తి ఎకౌంట్ కు 40 లక్షల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశారు. వీరంతా మునుగోడు నియోజకవర్గానికి చెందిన వ్యక్తులని, వీరికి సుషీ ఇన్ ఫ్రా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని టిఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ కు టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ.. వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.