తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Doctor Suicide : గన్ తో కాల్చుకొని ఎంపీ అసదుద్దీన్ వియ్యంకుడి ఆత్మహత్య

Doctor Suicide : గన్ తో కాల్చుకొని ఎంపీ అసదుద్దీన్ వియ్యంకుడి ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu

27 February 2023, 19:56 IST

    • Doctor Suicide : హైదరాబాద్ బంజారాహిల్స్ లో డాక్టర్ మజారుద్దీన్ అలీ ఖాన్ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మజారుద్దీన్... ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి వియ్యంకుడు. కుటుంబ కలహాలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. 
డాక్టర్ మజారుద్దీన్ అలీఖాన్ ఆత్మహత్య
డాక్టర్ మజారుద్దీన్ అలీఖాన్ ఆత్మహత్య

డాక్టర్ మజారుద్దీన్ అలీఖాన్ ఆత్మహత్య

Doctor Suicide : రాష్ట్రంలో వైద్యుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. సీనియర్ వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ స్టూడెంట్ ప్రీతి..... 5 రోజులు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడవగా... నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతోన్న హర్ష ఉరేసుకొని చనిపోయాడు. మరో ఘటనలో విజయవాడలో చదువుకుంటున్న ఖమ్మం వైద్య విద్యార్థి పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. పది రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది కన్నుమూశాడు. ఇలా మెడికోల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తోన్న వేళ.... హైదరాబాద్ లో మరో ఘటన చోటుచేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల

Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్

Mlc Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, బెయిల్ నిరాకరించిన కోర్టు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

హైదరాబాద్ బంజారాహిల్స్ లో మజారుద్దీన్ అనే వైద్యుడు గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని తన నివాసంలో గన్ తో కాల్చుకోవడంతో తీవ్ర గాయలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జూబ్లీహిల్స్ ఆపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మజారుద్దీన్ అలీ ఖాన్ కన్నుమూశాడు. మృతుడు మజార్... ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కి వియ్యంకుడు కావడం గమనార్హం. అసదుద్దీన్ ఓవైసీ రెండో కూతురు అసిఫాను... డాక్టర్ మజార్ కుమారుడు అబిల్ అలీ ఖాన్ కు ఇచ్చి వివాహం చేశారు. ఈ వివాహంతో... ఓవైసీ, మజారుద్దీన్ అలీఖాన్ కుటుంబాల మధ్య మూడు దశాబ్దాల స్నేహం.. బంధుత్వంగా మారింది. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడైన మజారుద్దీన్ అలీ ఖాన్... ఓవైసీ ఆసపుత్రి ఏర్పాటు చేసినప్పటి నుంచి అందులో ఆర్థోపెడిక్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు.

కుటుంబ కలహాల కారణంగానే డాక్టర్ మజారుద్దీన్ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఆయనపై గతంలో గృహ హింస కేసు నమోదైంది. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాపు చేస్తున్నామని.. లైసెన్స్ డ్ గన్ తో షూట్ చేసుకున్నట్లుగా తెలుస్తోందని.. పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ చెప్పారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోందన్న ఆయన.. ఎన్ని రౌండ్లు ఫైర్ చేశాడన్నది తేలాల్సి ఉందని పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి గొడవలు, కుటుంబ తగాదాలు ఉన్నాయని వివరించారు. కుటుంబ సభ్యులని కూడా విచారిస్తామని పేర్కొన్నారు.