తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఆవుకు డిజిటల్‌ పద్ధతిలో కృత్రిమ గర్భధారణ.. ఇక్కడ ఇదే తొలిసారి

ఆవుకు డిజిటల్‌ పద్ధతిలో కృత్రిమ గర్భధారణ.. ఇక్కడ ఇదే తొలిసారి

HT Telugu Desk HT Telugu

26 April 2022, 16:30 IST

    • పశువుల కృత్రిమ గర్భదారణ విధానంలో తెలంగాణ పశువైద్య నిపుణులు మరో అడుగు ముందుకు వేశారు. తాజాగా కృత్రిమ పద్ధతిలో డిజిటల్ విధానంలో గర్భధారణ చేశారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటి వరకూ నాటు పద్ధతిలోనే.. అంటే జననాంగంలోకి చేయి పెట్టడం ద్వారా పశువులకు గర్భధారణ చేసేవారు. అయితే తాజాగా మరో అడుగు ముందుకు వేసి.. మెుదటిసారి డిజిటల్‌ పద్ధతిలో నిర్వహించారు. పీవీ నరసింహా రావు పశువైద్య విశ్వవిద్యాలయంలో ఇలా చేశారు. ఇందులో భాగంగా.. లేజర్‌ కిరణాలతో కూడిన ఎండోస్కోపీ ట్యూబ్‌ ఇచ్చే డిస్‌ప్లే సమాచారం ఆధారంగా వీర్యాన్ని ఆవు గర్భాశయంలోకి పంపారు నిపుణులు.

ట్రెండింగ్ వార్తలు

TS LAWCET 2024 Updates : తెలంగాణ లాసెట్ ప్రవేశాలు - తక్కువ ఫైన్ తో దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్

Siddipet District : పగటిపూట బట్టల అమ్మకం, రాత్రివేళ చోరీలు - చివరికి ఇలా దొరికిపోయాడు..!

Telangana Tourism : బీచ్ పల్లి టెంపుల్, జోగులాంబ శక్తి పీఠం దర్శనం - రూ. 1500కే స్పెషల్ టూర్ ప్యాకేజీ

TS TET 2024 Updates : అలర్ట్... మే 15 నుంచి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు, డౌన్లోడ్ లింక్ ఇదే

ఎండోస్కోపీ ట్యూబ్‌తోపాటు వచ్చే పెన్‌డ్రైవ్‌ను కాలర్‌ హ్యాంగింగ్‌ మొబైల్‌ ఫోన్‌కు అటాచ్‌ చేశారు. దీని ద్వారా గర్భాశయ ముఖద్వారం, వీర్యం వెళుతున్న విధానం కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఇలా ఈ ప్రయోగం నిర్వహించారు. అలా పంపిన వీర్యం పూర్తిస్థాయిలో పశువు గర్భాశయం లోకి వెళ్లింది. నాటు పద్ధతితో 30-40 శాతం ఫలదీకరణే జరుగుతుండగా డిజిటల్‌ గర్భధారణ విధానంలో 60-70 శాతం వరకు ఫలదీకరణ జరిగే అవకాశం ఉందని.. పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతోంది.

ఈ ప్రయోగంలో పశువైద్య విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాంసింగ్‌ లకావత్‌తోపాటు ఇంటర్న్‌షిప్, ఫైనలియర్‌ విద్యార్థులు ఉన్నారు. సర్జరీ విభాగం హెచ్‌వోడీ ప్రొఫెసర్‌ ఇ.ఎల్‌. చంద్రశేఖర్‌ సమక్షంలో ఈ ప్రయోగం జరిగింది.