తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Delhi Excise Policy: హైదరాబాద్ సహా 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

Delhi excise policy: హైదరాబాద్ సహా 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

HT Telugu Desk HT Telugu

07 October 2022, 9:30 IST

  • Delhi excise policy: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోవిడత ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అక్రమాలపై దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ సహా 35 ప్రాంతాల్లో సోదాలు జరుపుతోంది.

హైదరాబాద్ సహా 35 ప్రాంతాాల్లో ఈడీ సోదాలు
హైదరాబాద్ సహా 35 ప్రాంతాాల్లో ఈడీ సోదాలు (HT_PRINT)

హైదరాబాద్ సహా 35 ప్రాంతాాల్లో ఈడీ సోదాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ అంశాల్లో దర్యాప్తుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం తాజాగా దాడులు ప్రారంభించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ట్రెండింగ్ వార్తలు

TS SET Notification 2024 : తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల - మే 14 నుంచి దరఖాస్తులు, ముఖ్య తేదీలివే

Army Public School Jobs 2024 : బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు - అప్లికేషన్ ప్రాసెస్, ఖాళీల వివరాలివే

Siddipet Accident : పెళ్లి రోజే విషాదం, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Youth Cheated Producer : ఒక్క ఛాన్స్ అంటూ నిర్మాత చుట్టూ ప్రదక్షిణాలు, అవకాశం చిక్కగానే బంగారంతో జంప్

ఢిల్లీ, పంజాబ్‌లోని దాదాపు 35 చోట్ల, హైదరాబాద్‌లోని కొన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కొన్ని మద్యం పంపిణీదారులు, కంపెనీలు, అనుబంధ సంస్థలపై సోదాలు జరుగుతున్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి.

ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటి వరకు 103 కంటే ఎక్కువ దాడులు నిర్వహించింది. ఈ కేసులో గత నెలలో మద్యం వ్యాపారి, ఇండోస్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహంద్రును కూడా అరెస్టు చేసింది.

మనీలాండరింగ్ కేసును సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో జరిగిన అవకతవకలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు సిఫార్సు చేసిన తర్వాత మద్యం పాలసీపై దర్యాప్తు జరిగింది. ఈ విషయంలో 11 మంది ఎక్సైజ్ అధికారులను కూడా సస్పెండ్ చేశారు.

హైదరాబాద్‌లో ఇదివరకు అరుణ్ రామచంద్ర పిళ్లై, ప్రేమసాగర్ గండ్ర, అభిషేక్ రావు తదితరుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీలు సోదాలు నిర్వహించింది.