తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Resignations: బీజేపీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్

BJP Resignations: బీజేపీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్

HT Telugu Desk HT Telugu

21 October 2022, 13:06 IST

    • BJP Resignations  మునుగోడు ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న సమయంలో బీజేపీకి దాసోజు శ్రవణ్‌ గుడ్‌ బై చెప్పేశారు.  పార్టీలో బలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆరోపిస్తూ  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌కు లేఖ రాశారు. 
బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్ (ఫైల్)
బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్ (ఫైల్) (twitter)

బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్ (ఫైల్)

మునుగోడు ఎన్నికల వేళ బీజేపీకి దాసోజు శ్రవణ్ గుడ్‌బై చెప్పేశారు. పార్టీ ఎన్నికలు సమీపిస్తుండగా శ్రవణ్‌ పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు లేఖ రాశారు. శ్రవణ్‌తో పాటు మరికొందరు నాయకులు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

భారతీయ జనతా పార్టీని వీడుతున్నట్లు బండి సంజయ్‌ ప్రకటించారు. తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం అనిశ్చితమైన దశదిశా లేని రాజకీయా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామని చెప్పిన బీజేపీ, మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరిస్తున రాజకీయ తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని పేర్కొన్నారు. సామాజిక బాధ్యత లేకుండా ఎన్నికలు అనగానే డబ్బు సంచులు పంచాలన్నట్లు, బడా కాంట్రాక్టర్లు రాజ్యాలు ఏలాలి, పెట్టుబడి రాజకీయాలు చేయాలన్నట్లుగా కొనసాగిస్తున్న వైఖరి బలహీన వర్గాల నాయకులకు స్థానం ఉండదని అర్ధమైందని లేఖలో ఆరోపించారు.

అనేశ ఆశలతో బీజేపీలో చేరినా, దశా దిశా లేని నాయకత్వ ధోరణులు, నిర్మాణాత్మక రాజకీయాలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఏ మాత్రం ఉపయోగకరంగా లేవని అర్థమైందన్నారు. ఆగష్టు 7న బీజేపీలో చేరిన శ్రవణ్ రెండు నెలలు కూడా ఆ పార్టీలో కొనసాగ లేకపోయారు.

ప్రజాహితమైన పథకాలతో నిబద్ధత కలిగిన రాజకీయ సిద్ధంతాలతో ప్రజలను మెప్పించడం కంటే మందు, మాంసం విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం ద్వారా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు సాధించాల నుకుంటున్న తీరుపై నిరసనగా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, శాసన మండలి మాజీ ఛైర్మన్‌ స్వామి గౌడ్ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది.

టాపిక్