తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rana On Indigo : 'ఇండిగో'పై రానా షాకింగ్ కామెంట్స్..

Rana On IndiGo : 'ఇండిగో'పై రానా షాకింగ్ కామెంట్స్..

HT Telugu Desk HT Telugu

04 December 2022, 22:25 IST

    • Rana Comments On Indigo : ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఇండిగోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత చెత్త ఎయిర్ లైన్స్ అని ట్వీట్ చేశారు. ఆయనకు ఎదురైన అనుభవం ఏంటి?
ఇండిగోపై రానా కామెంట్స్
ఇండిగోపై రానా కామెంట్స్ (twitter)

ఇండిగోపై రానా కామెంట్స్

దగ్గుబాటి రానా(Daggubati Rana) అనగానే.. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారనేది జనాలకు తెలుసు. కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. అయితే ఆయనకు సడెన్ గా ఇండిగో(IndiGo) విమానయాన సంస్థపై కోపం వచ్చింది. అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తీవ్రంగా స్పందించారు రానా.

ట్రెండింగ్ వార్తలు

Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్

Mlc Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, బెయిల్ నిరాకరించిన కోర్టు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

'ఇండియాలో ఇండిగో(IndiGo) అంత చెత్త విమాన ప్రయాణం చేయలేదు. విమానం టైమింగ్స్ గురించి ఎవరికీ తెలీదు. కనిపించకుండా పోయిన లగేజ్ గురించి తెలియదు. సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలీదు. ఇంత కన్నా చెత్తగా ఏదైనా ఉంటుందా?' అని రానా ట్వీట్ చేశారు.

'ఇండిగో విమానాలు అనుకున్న సమయానికి టేకాఫ్ కాకపోవచ్చు. ల్యాండ్ కాకపోవచ్చు. మీ లగేజ్ కి కూడా భద్రత ఉండదు.' అని రానా పేర్కొన్నారు. ఇండిగో వింటర్ సేల్ ఆఫర్ పై అఫిషియల్ అకౌంట్లో ట్వీట్ చేయగా.. రీట్వీట్ చేస్తూ.. రానా(Rana) గట్టిగా కౌంటర్లు ఇచ్చారు. అయితే దీనికి కొంతమంది నెటిజన్ల నుంచి కూడా మద్దతు దొరికింది. కాసేపటికి మాత్రం.. ఇండిగో నుంచి.. ఇటు రానా అకౌంట్ నుంచి.. ఈ విషయానికి సంబంధించి.. ట్వీట్లు కనిపించలేదు.

తన కుటుంబ సభ్యులతో కలిసి.. హైదరాబాద్‌(Hyderabad)లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి.. బెంగళూరు(Bengaluru)కు వెళ్లినప్పుడు రానా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ప్రయాణికులను చెక్-ఇన్ చేసిన తర్వాత, కొన్ని సాంకేతిక సమస్య కారణంగా విమానం ఆలస్యమైందని, మరొక విమానంలో ఎక్కమని అడిగారు. వారి లగేజీని కూడా అదే విమానంలో పంపిస్తామని చెప్పారు. అయితే, బెంగళూరు విమానాశ్రయం(Air Port)లో దిగిన తర్వాత రానాకు తన లగేజీ రాలేదు.

'ఇండిగో(IndiGo) విమానాలు అనుకున్న సమయానికి టేకాఫ్ కాకపోవచ్చు. ల్యాండ్ కాకపోవచ్చు. మీ లగేజ్ కూడా భద్రత ఉండదు.' అని ట్వీట్ చేశారు రానా. ఇండియాలో ఇంత చెత్త ఎయిర్ లైన్స్(AirLines) అనుభవం ఎప్పుడూ లేదన్నారు. అయితే దానితో ఆగలేదు.. 'మా ఇంజినీర్లు(Engineers) రోజూ నిరంతరాయంగా సురక్షితమైన, అవాంతరాలు లేని విమానాలను అందిస్తున్నారు.' అని ఇండిగో చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. 'ఇంజినీర్లు బాగుండొచ్చు సిబ్బందికి మాత్రం ఏం తెలీదు! దీనికి మీరు ఏదైనా ప్రాపర్‌గా చేయాలి.' అని సూచించారు.

స్వర్గం దొరికిందని..అని విమానంలో నుంచి తీసిన అందమైన ఫొటోను గతంలో ఇండిగో ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్ కు.. దొరికిన స్వర్గం కంటే పోయిందే ఎక్కువ అంటూ సెటైర్ వేశారు. అయితే రానా(Rana)కు మద్దతుగా కొంతమంది నెటిజన్లు కూడా వచ్చారు. ఏమైందో ఏమో.. కాసేపటికే ట్వీట్లు(Tweets) మాత్రం కనిపించలేదు. కానీ అప్పటికే చాలామంది స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నారు. దీంతో ఇండిగోపై రానా షాకింగ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి.