తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. కొత్తగా 10 లక్షల పెన్షన్లు

CM KCR: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. కొత్తగా 10 లక్షల పెన్షన్లు

06 August 2022, 17:33 IST

google News
    • Aasara Pensions in Telangana: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో) (twitter)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

Telangana Aasara Pension: కొత్త పెన్షన్ల కోసం చాలా మంది ప్రజలు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్లు ఉన్నాయన్న ఆయన... త్వరలోనే కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. పాత కార్డుల ప్లేస్ లో కొత్త కార్డులు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించబోతున్నామని తెలిపారు.

'ప్రస్తుతం 36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నాం. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తాం. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పింఛన్‌దారుల సంఖ్య 46 లక్షలకు చేరుతుంది: 57 ఏళ్లు అర్హతగా పింఛన్లు ఇస్తాం. కొత్తగా డయాలసిస్ పేషెంట్లకు కూడా పింఛన్లు ఇస్తాం. వజ్రోత్సవ వేళ సత్ప్రవర్తన గల ఖైదీలను విడుదల చేస్తాం' - కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

ఆదివారం జరగబోయే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్రం తీరును దుయ్యబట్టారు. వెంటనే పాల ఉత్పత్తులు, చేనేత కార్మికుల, శ్మశానాలపై జీఎస్టీ పన్నును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎప్ఆర్ బీఎం ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు. 5 జీ స్పెక్ట్రం వేలం పెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఉపాధి కూలీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం చూస్తోందని మండిపడ్డారు.

పంచాయతీరాజ్‌ విభాగంలో రాష్ట్రానికి 10 అవార్డులు వచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. నీతి ఆయోగ్ ఎంతో ప్రశంసించిందన్నారు. కేంద్రం నుంచి ప్రశంసలే తప్ప... నిధులు రాలేదని ఆరోపించారు. శుష్కప్రియాలు... శూన్య హస్తాలు అన్నట్లు కేంద్ర విధానం ఉందని విమర్శించారు. కేంద్ర- రాష్ట్ర ఉమ్మడి పథకాల్లో తెలంగాణ రూ.1.92 లక్షల కోట్లు ఖర్చు చేసిందని ప్రస్తావించారు. కానీ కేంద్రం నుంచి మాత్రం రాష్ట్రానికి రూ.5 వేల కోట్లు వచ్చాయని చెప్పారు. నీతి ఆయోగ్‌ సమావేశాలతో.. ఎవరికీ ఉపయోగం ఉండదన్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఆ సమావేశాల్లో పల్లికాయలు తింటూ కుర్చోవడం తప్ప చేసేదేం లేదని సెటైర్లు విసిరారు.

తదుపరి వ్యాసం