తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Metro Phase-2 : హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పై క్లారిటీ, నాగోల్ చాంద్రాయణగుట్ట 14 కి.మీ మెట్రో మార్గంలో 13 స్టేషన్

Hyderabad Metro Phase-2 : హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పై క్లారిటీ, నాగోల్ చాంద్రాయణగుట్ట 14 కి.మీ మెట్రో మార్గంలో 13 స్టేషన్

HT Telugu Desk HT Telugu

28 April 2024, 16:05 IST

google News
    • Hyderabad Metro Phase-2 : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. నాగోల్, చాంద్రాయణగుట్ట మార్గంలో 14 కి.మీలలో మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబద్ మెట్రో ఫేజ్-2 లో 13 స్టేషన్లు నిర్మించనున్నారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పై క్లారిటీ
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పై క్లారిటీ

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పై క్లారిటీ

Hyderabad Metro Phase-2 : హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ -2 (Hyderabad Metro Rail Phase-2)కు సంబంధించి మరో క్లారిటీ వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్(Nagole) నుంచి చాంద్రాయణగుట్ట(Chandrayangutta) వరకు 14 కి.మీ మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. అయితే ఫేజ్- 2లో మొత్తం 13 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. నాగోల్ మెట్రో స్టేషన్ తో మొదలై.....నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీనగర్ కూడలి, సాగర్ రింగ్ రోడ్డు , మైత్రి నగర్, కర్మన్ ఘాట్, చంపాపేట్ రోడ్ కూడలి , ఓవైసీ ఆసుపత్రి, డిఆర్డీఓ ఆఫీస్, హఫీజ్ బాబానగర్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కొత్తగా 13 స్టేషన్లు రాబోతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ మార్గంలో మెట్రో అలైన్మెంట్, స్టేషన్ స్థానాలను ఖరారు చేసేందుకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఎన్వీస్ రెడ్డి పరిశీలించారు. మెట్రో రైల్ స్టేషన్లకు సంబంధించి వాటి పేర్ల ఖరారుకు ట్రాఫిక్ పోలీసులు, సాధారణ ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు.

నాగోల్ లో కొత్తగా స్కై వాక్

నాగోల్(Nagole) లో ఇప్పుడున్న స్టేషన్ సమీపంలోనే.....న్యూ నాగోల్ స్టేషన్ (ఎల్బీ నగర్ మార్గంలో ) వస్తుందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి(Metro Rail MD NVS Reddy) తెలిపారు. ఈ రెండింటిని అనుసంధానం చేసేలా విశాలమైన ఓ స్కై వాక్(Sky Walk) కూడా నిర్మించనున్నట్టు తెలిపారు. నాగోల్ లో మూసీ వంతెన, మంచినీటి పైప్లైన్, విద్యుత్ లైన్ లు ఉన్నందున మెట్రో అలైన్మెంట్ ను 10 మీటర్లు ఎడమవైపు మార్చామని.......మూసీ పునరుజ్జీవ పనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పొడవైన స్పాన్ లు ఉండేలా ప్రణాళిక రూపొందించాల్సి ఉందన్నారు. మూసీ నదిపై మెట్రో వంతెనను నిర్మాణానికి హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటెడ్ అధికారులు పరిశీలిస్తున్నారన్నారు. ఈ బ్రిడ్జి పిల్లర్లను ఒకదానికొకటి మధ్య ఎక్కువ గ్యాప్ తో నిర్మించాల్సి ఉందని.....అది చాలా కష్టమైన పని అన్నారు. దీంతో పాటు బైరామల్ గూడ / సాగర్ రింగ్ రోడ్ జంక్షన్ లో మల్టిపుల్ ఫ్లైఓవర్ లు ఉండడంతో మెట్రో లైన్ ఎత్తు పెరుగుతుంది. దీన్ని తగ్గించడానికి అలైన్మెంట్ ను కుడివైపు మార్చాల్సి వస్తుందని, ఫ్లైఓవర్ కారణంగా చాంద్రాయణగుట్ట ఇంటర్ ఛేంజ్ స్టేషన్ నిర్మాణం సవాలుగా మారనుందని తెలిపారు. నాగోల్ నుంచి చాంద్రాయాణగుట్ట(Chandrayangutta) వరకు ఫ్లైఓవర్ల కారణంగా స్టేషన్ కోసం భూ సేకరణ తప్పడం లేదన్నారు. కొన్ని చోట్ల ప్రైవేట్ ఆస్తులను కూడా సేకరించాలని అధికారులను మెట్రో రైల్ ఎండీ ఆదేశించారు.

ఫ్లైఓవర్ల కారణంగా మెట్రో నిర్మాణానికి ఇబ్బందులు

నాగోల్(Nagole) నుంచి ఎల్బీ నగర్(LB Nagar) వస్తున్నప్పుడు....ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ కుడివైపు కామినేని ఆసుపత్రి స్టేషన్ వస్తుంది. ఆ తరువాత ఎల్బీ నగర్ జంక్షన్ స్టేషన్....కూడలికి కుడివైపు వస్తుంది. ఇప్పుడున్న ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్(LB Nagar Metro Station) వరకు విశాలమైన స్కై వాక్ తో అనుసంధానం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులోనే వాక్ లెటర్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ తరహా సౌకర్యం ఇప్పటి వరకు హైదరాబాద్(Hyderabad) నగరంలో ఎక్కడా లేదని చెబుతున్నారు. అలాగే బౌరామల్ గూడ - సాగర్ రోడ్డు జంక్షన్ లో ఇప్పటికే ఫ్లైఓవర్ ల కారణంగా.....అక్కడ వాటి కంటే మరింత ఎత్తులో మెట్రో రైలు లైన్(Metro Rail New Line) ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అలాగే ఆ ప్రాంతంలోని మెట్రో స్టేషన్ ఎత్తును తగ్గించేందుకు, మెట్రో అలైన్మెంట్ ను ఫ్లైఓవర్ కుడివైపుకు మార్చాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. చాంద్రాయణగుట్ట ఇంటర్ ఛేంజ్ స్టేషన్ కు మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు.

కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం