Hyd Metro Phase2: ఖరారైన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 రూట్ మ్యాప్
Hyd Metro Phase2: హైదరాబాద్ మెట్రో ఫేజ్ - 2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్ మ్యాప్ ను సిద్దం చేశారు.
Hyd Metro Phase2: హైదరాబాద్ మెట్రో ఫేజ్ - 2 భాగంగా 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు....ఆ వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు.
మెట్రో విస్తరణలో భాగంగా జెబియేస్ నుంచి ఎంజిబిఎస్ మీదుగా చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్ వరకు మెట్రో మార్గాన్ని పొడిగించనున్నారు.కొత్తగా మరో నాలుగు కారిడార్లలో నిర్మాణం చేపట్టనున్నారు.
కొత్త మెట్రో మార్గాలు ఇవే.....
• కారిడార్ 2 : ఎంజీబయేస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్ నామ వరకు ( 5.5 కిలోమీటర్లు )
• కారిడార్ 2 : ఫలక్ నామ నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్ వరకు ( 1.5 కిలోమీటర్లు )
• కారిడార్ 4 : నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు ( నాగోల్ - ఎల్ బి నగర్ - చాంద్రాయణగుట్ట - మైలర్ లో పల్లి నుంచి ఎయిర్పోర్ట్ వరకు ( 29 కిలోమీటర్లు )
• కారిడార్ 4 : మైలర్ దేవ పల్లి నుంచి ప్రతి పాధించిన హై కోర్టు వరకు ( 4 కిలోమీటర్లు)
• కారిడార్ 5 : రాయదుర్గం నుంచి అమెరికన్ కన్సల్టెంట్ ( ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ) వరకు ( రాయదుర్గం - నానక్ రామ్ గూడ - విప్రో జంక్షన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ( 8 కిలోమీటర్లు)
• కారిడార్ 6 : మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు ( మియాపూర్ - BHEL - పటాన్ చెరువు వరకు ( 8 కిలోమీటర్లు)
• కారిడార్ 7 : ఎల్బీ నగర్ నుంచి హయాత్ నగర్ ( ఏల్బి నగర్ - వనస్థలిపురం - హయాత్ నగర్ వరకు ( 8 కిలోమీటర్లు ).
అందరికీ అందుబాటులో మెట్రో....
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లే వారిలో ఎక్కువ శాతం విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లే వారే ఉన్నారు. మరోవైపు పాతబస్తీ నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ప్రతీ ఏడాది వేలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు తరలి వెళ్తారు.
ఈ ప్రయాణికులు అంతా జేబీఎస్, ఎంజీబీఎస్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్తారు. ప్రతిరోజు సుమారు 65 వేల మంది జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులు ఏర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రయాణికుల్లో 80 శాతం వరకు నగరానికి తూర్పు, ఉత్తరం, దక్షిణ వైపు నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్ళే వారే ఉంటారు.
గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం - ఎయిర్పోర్ట్ కు బదులు ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదించిన ఎంజీబీఎస్ - ఎయిర్ పోర్ట్ మార్గం వల్ల అందరికీ ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ కొత్త మెట్రో రూట్ వల్ల ప్రయాణికులు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ కు వెళ్ళవచ్చు.
రాయదుర్గం ,అమీర్‌పేట్, ఉప్పల్ ,నాగోల్ మీదుగా ఎల్బీనగర్ నుంచి ఎయిర్పోర్ట్ కు రాకపోకలు సాగించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల ఎక్కువ మంది ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని నగరం నలుమూలల నుంచి కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా