తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Metro : ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్, ఆ కార్డులపై రాయితీలు ఆరు నెలలు పొడిగింపు

Hyderabad Metro : ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్, ఆ కార్డులపై రాయితీలు ఆరు నెలలు పొడిగింపు

08 April 2024, 19:55 IST

    • Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. వివిధ రాయితీలను మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్ మెట్రో

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 31తో ముగిసిన మెట్రో రైలు రాయితీలు, మళ్లీ పొడిగిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రకటించారు. ఉగాది సందర్భంగా మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు, సూపర్‌ ఆఫ్ పీక్‌ అవర్‌ ఆఫర్లను ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు. మెట్రో వివిధ మార్గాల్లో ప్రత్యేక రాయితీలను అమలుచేస్తుంది. అయితే ఇవి మార్చి 31తో ముగిశాయి. తాజాగా ఈ రాయితీను పొడిగిస్తూ హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డుతో సెలవు రోజుల్లో రూ.59కే ప్రయాణం చేసే సదుపాయం మెట్రో కల్పిస్తుంది. రద్దీ లేని సమయాల్లో ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం రాయితీ ఇస్తూ సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌ ఆఫర్ అందిస్తుంది. విద్యార్థుల కోసం మెట్రో స్టూడెంట్‌ పాస్‌(Metro Student Pass)లను అమలుచేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

US Indian Student Missing: అమెరికాలో తెలంగాణ విద్యార్ధి అదృశ్యం, మే2 నుంచి అదృశ్యమైన రూపేష్ చింతకింది

Graduate Mlc election: వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎటు వైపు? మూడు పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

Nalgonda Ellayya Murder: దొరికిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడి డెడ్ బాడీ.. అంత్యక్రియలు పూర్తి

Karimnagar News : రైతులకు నష్టం జరగనివ్వం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం- పౌరసరఫరాల శాఖ కమిషనర్

వేసవి రద్దీ

వేసవి ఉష్ణోగ్రతలు(Summer Temperatures) పెరుగుతుండడంతో... ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రద్దీ పెరిగింది. మెట్రో మూడు మార్గాల్లో ప్రతి రోజు దాదాపుగా 5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. పనిరోజుల్లో మెట్రోలో(Hyderabad Metro) ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీక్ ఎండ్ లో కాస్త తక్కువగా ఉంటుంది. ఆర్టీసీ మహిళల(Mahalakshmi Scheme) ఫ్రీ జర్నీ పథకాన్ని అమలుచేసిన తర్వాత మెట్రోపై ప్రభావం చూపింది. మహిళ ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలకు మొగ్గు చూపారు. అయితే ఎండలు తీవ్రత పెరుగుతుండడంతో... మెట్రోలో రద్దీ పెరుగుతోందని నిర్వాహకులు అంటున్నారు.

మెట్రో ప్రయాణాల్లో డిస్కౌంట్లు కీలకం

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో హైదారాబాద్ వాసులు మెట్రో(Hyderabad Metro)ను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. చాలా మంది ప్రయాణికులు తమ రోజువారీ ప్రయాణాలకు మెట్రోపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. సెలవు దినాల్లో రూ. 59తో రోజంతా ప్రయాణించే విధంగా మెట్రో హాలిడే కార్డును(Metro Holiday Card) తీసుకొచ్చింది. ఈ హాలిడే కార్డు ఆదివారం, రెండో శనివారంతో పాటు ఇతర సెలవు రోజుల్లో అందుబాటులో ఉండేది. సాధారణ రోజుల్లో ఉండే మెట్రో కార్డుపై ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు.. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఇచ్చే 10 శాతం రాయితీ ఇస్తారు. ఈ రాయితీలను మెట్రో మరో ఆరు నెలలు పొడిగించింది. డిస్కౌంట్లు, హాలిడే కార్డును పునరుద్ధరించాలని ప్రయాణికులు మెట్రో అధికారులకు విజ్ఞప్తి చేశారు. రోజువారీ ప్రయాణికులకు డిస్కౌంట్లు కీలక పాత్ర పోషిస్తాయని పలువురు సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు.