LB Nagar Flyover: ఇక ఆగేది లేదు... ఎల్బీనగర్‌ RHS ఫ్లైఓవర్ రెడీ-lb nagar rhs flyover ready for inauguration in hyderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Lb Nagar Rhs Flyover Ready For Inauguration In Hyderabad

LB Nagar Flyover: ఇక ఆగేది లేదు... ఎల్బీనగర్‌ RHS ఫ్లైఓవర్ రెడీ

Mar 25, 2023, 10:35 AM IST HT Telugu Desk
Mar 25, 2023, 10:35 AM , IST

LB Nagar RHS Flyover: ఎల్బీనగర్‌ ఆర్‌హెచ్‌ఎస్‌(right-hand side) ఫ్లై ఓవర్‌ సిద్ధమైంది. ఈ పైవంతెనను శనివారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు. ఫలితంగా రాకపోకలు మరింత సులంభం కానున్నాయి. ఫ్లై ఓవర్‌ కు సంబంధించిన కొన్ని ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఎల్బీ నగర్ చౌరస్తాలో ట్రాఫిక్  రద్దీని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టారు. రూ.32 కోట్లతో ఈ ఆర్‌హెచ్‌ఎస్‌ ఫ్లైవంతెన పనులను పూర్తి చేశారు.

(1 / 5)

ఎల్బీ నగర్ చౌరస్తాలో ట్రాఫిక్  రద్దీని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టారు. రూ.32 కోట్లతో ఈ ఆర్‌హెచ్‌ఎస్‌ ఫ్లైవంతెన పనులను పూర్తి చేశారు.(twitter)

దిల్‌సుఖ్‌నగర్‌ - హయత్ నగర్ మార్గంలో నిర్మించిన ఈ పైవంతెనను శనివారం మంత్రి కేటీఆర్‌ సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 

(2 / 5)

దిల్‌సుఖ్‌నగర్‌ - హయత్ నగర్ మార్గంలో నిర్మించిన ఈ పైవంతెనను శనివారం మంత్రి కేటీఆర్‌ సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. (twitter)

ఎస్సార్డీపీ ప్రణాళికలో భాగంగా ఒక్క ఎల్బీనగర్‌ నియోజకవర్గం పరిధిలోనే 448 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 13 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది సర్కార్. వీటిలో ఇప్పటికే 8 పనులు పూర్తయ్యాయి. ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు చౌరస్తాలో ఎడమ వైపు ఫ్లై ఓవర్‌, కామినేని నుండి ఎల్బీనగర్‌ వైపు కుడి, ఎడమ ఫ్లై ఓవర్లు, చింతలకుంట, ఎల్బీనగర్‌ ఇరువైపులా అండర్‌పాస్‌లు, బైరామల్‌గూడ ఎడమ, కుడివైపు ఫ్లై ఓవర్‌ నిర్మాణాలు పూర్తి కావడంతో ఈ మార్గంలో రాకపోకలు సిగ్నల్‌ ఫ్రీగా మారాయి. ప్రస్తుతం ఎల్బీనగర్‌ కుడి ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తి అయ్యింది.

(3 / 5)

ఎస్సార్డీపీ ప్రణాళికలో భాగంగా ఒక్క ఎల్బీనగర్‌ నియోజకవర్గం పరిధిలోనే 448 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 13 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది సర్కార్. వీటిలో ఇప్పటికే 8 పనులు పూర్తయ్యాయి. ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు చౌరస్తాలో ఎడమ వైపు ఫ్లై ఓవర్‌, కామినేని నుండి ఎల్బీనగర్‌ వైపు కుడి, ఎడమ ఫ్లై ఓవర్లు, చింతలకుంట, ఎల్బీనగర్‌ ఇరువైపులా అండర్‌పాస్‌లు, బైరామల్‌గూడ ఎడమ, కుడివైపు ఫ్లై ఓవర్‌ నిర్మాణాలు పూర్తి కావడంతో ఈ మార్గంలో రాకపోకలు సిగ్నల్‌ ఫ్రీగా మారాయి. ప్రస్తుతం ఎల్బీనగర్‌ కుడి ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తి అయ్యింది.(twitter)

ఎస్సార్డీపీలో 19వ ప్రాజెక్టు అయిన ఈ పైవంతెన 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మించినట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

(4 / 5)

ఎస్సార్డీపీలో 19వ ప్రాజెక్టు అయిన ఈ పైవంతెన 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మించినట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.(twitter)

ఎస్సార్డీపీలో 19వ ప్రాజెక్టు అయిన ఈ పై వంతెనను 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ల ఫలితంగా విజయవాడకు వైపు వెళ్లే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

(5 / 5)

ఎస్సార్డీపీలో 19వ ప్రాజెక్టు అయిన ఈ పై వంతెనను 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ల ఫలితంగా విజయవాడకు వైపు వెళ్లే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.(twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు