తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Bandi Sanjay : రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం గిరిజన మహిళను అవమానించడమే

BJP Bandi Sanjay : రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం గిరిజన మహిళను అవమానించడమే

HT Telugu Desk HT Telugu

31 January 2023, 15:59 IST

    • BJP Bandi Sanjay రాష్ట్రపతి ప్రసంగాన్ని బిఆర్ఎస్ పార్టీ బహిష్కరించడంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  బిఆర్‌ఎస్ తీరు దళిత, గిరిజన మహిళలను అవమానించడమేనని మండిపడ్డారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కావడాన్ని బీఆర్‌ఎస్‌ జీర్ణించుకోలేక పోతోందని, దేశానికి దశ-దిశ చూపేలా రాష్ట్రపతి ప్రసంగం ఉందన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే  దానిపై చర్చించే అవకాశం ఉండగా,  బహిష్కరించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 
బండి సంజయ్
బండి సంజయ్

బండి సంజయ్

BJP Bandi Sanjay రాష్ట్రపతి ప్రసంగంపై అభ్యంతరాలుంటే చర్చించే అవకాశముండగా బహిష్కరించాల్సిన అవసరమేముందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తక్షణమే మహిళలకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ లో ఏబీవీపీ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, బీఆర్ఎస్ నేతలు కండకావరంతో దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తలుచుకుంటే బీఆర్ఎస్ నేతలెవరూ బయట తిరగలేరన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Siddipet Accident : పెళ్లి రోజే విషాదం, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Youth Cheated Producer : ఒక్క ఛాన్స్ అంటూ నిర్మాత చుట్టూ ప్రదక్షిణాలు, అవకాశం చిక్కగానే బంగారంతో జంప్

Cyber Crime : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం, సిద్దిపేట యువతికి రూ.16 లక్షలు టోకరా - ఏపీలో సైబర్ కేటుగాడు అరెస్ట్

Mlc Dande Vithal : ఎమ్మెల్సీగా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు, సుప్రీంలో సవాల్ చేస్తానంటోన్న దండే విఠల్

రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తప్పుపట్టారు. ఆదివాసీ మహిళా రాష్ట్రపతి తొలిసారి పార్లమెంట్ లో ప్రసంగిస్తుంటే జీర్ణీంచుకోలేకే బీఆర్ఎస్ బహిష్కరించిందన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల మహిళలంటే బీఆర్ఎస్ కు అసహ్యమని, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు బిఆర్ఎస్‌ నేతలు ప్రయత్నించారని ఆరోపించారు.

కేసీఆర్ తొలి కేబినెట్‌లో కూడా మహిళలకు చోటు కల్పించ లేదని గుర్తు చేశారు. తక్షణమే మహిళలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల, బీఆర్ఎస్ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తాము తలుచుకుంటే బీఆర్ఎస్ నేతలెవరూ బయట తిరగలేరని హెచ్చరించారు.

మారుమూల ప్రాంతానికి చెందిన ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికైన తరవాత పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి మొట్టమొదటిసారి ప్రసంగిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించడం సిగ్గు చేటని, ఎందుకు బహిష్కరించారో కారణం లేదని, రాష్ట్రపతి రాజకీయ నాయకురాలు కాదన్నారు.

రాష్ట్రపతి ప్రసంగం విన్న తరువాత ఎవరూ బహిష్కరించాలని కూడా అనుకోరని, రాష్ట్రపతి ప్రసంగం దేశానికి దిశా, దశ చూపేదిగా ఉన్న ప్రసంగమని, గత 9 ఏళ్లలో దేశం ఏ విధంగా అభివ్రుద్ది చేశారో... రాబోయే 25 ఏళ్లలో దేశం ఎట్లా కీలకం కానుందో చెప్పారన్నారు.

రాష్ట్రపతి ప్రసంగంలో ఏమైనా అభ్యంతరాలుంటే... ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొని అభిప్రాయాలు చెప్పొచ్చని, అభ్యంతరాలు తెలపొచ్చని, కానీ బీఆర్ఎస్ పైకి చెబుతున్నది ఒకటి... లోపలున్నది వేరన్నారు. దళిత, గిరిజన, ఆదివాసీ, బలహీనవర్గాల మహిళలంటే కేసీఆర్ కు ద్వేషమన్నారు.

గతంలో మైనారిటీ, ఎస్సీ వ్యక్తులను రాష్ట్రపతిని చేసిన బీజేపీ ఈసారి ఆదివాసీ మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదిస్తే ఇదే బీఆర్ఎస్ పార్టీ ఓడించేందుకు యత్నించిందన్నారు. కేసీఆర్ తొలి కేబినెట్ లో ఒక్క మహిళ కూడా లేరని, మహిళా కమిషన్ లేదని, మహిళా గవర్నర్ ను అడుగడుగునా అవమానిస్తారని, కోర్టు కు వెళతారని కోర్టు చెంప చెళ్లుమన్పిస్తే తిరిగి గవర్నర్ ను పిలుస్తారని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ సలహాలిచ్చే వాళ్లెవరో ఆ పార్టీని ముంచడానికి చేస్తున్నట్లుందని, జనం వాళ్లను చూసి నవ్వుకుంటున్నారన్నారు. అసెంబ్లీలో చర్చించే అవకాశం కేసీఆర్ ఎవ్వరికీ ఇవ్వరని, మాట్లాడితే సస్పెండ్ చేస్తారని, పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై చర్చిద్దాం రమ్మంటే రారని రాష్ట్రపతి ప్రసంగిస్తుంటే బహిష్కరిస్తారని ఎందుకు బహిష్కరిస్తున్నారో కారణం చెప్పరని తప్పు పట్టారు.

టాపిక్