తెలుగు న్యూస్  /  Telangana  /  Bharat Gaurav Tourist Train From Secunderabad To Vaishno Devi On June 10

Bharat GouravTrain: వైష్ణోదేవి, హరిద్వార్, రిషికేష్ సందర్శనకు భారత్ గౌరవ్ రైలు

HT Telugu Desk HT Telugu

19 May 2023, 8:02 IST

    • Bharat GouravTrain: అధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రవేశపెట్టిన భారత్ గౌరవ్ రైలు విజయవంతం కావడంతో  జూన్‌ 10న వైష్ణోదేవి ఆలయంతో పాటు హరిద్వార్, రిషికేష్ యాత్రను నిర్వహిస్తున్నట్లు ఐఆర్‌‌సిటిసి ప్రకటించింది. 
సికింద్రబాద్ నుంచి వైష్ణోదేవికి భారత్ గౌరవ్ రైలు
సికింద్రబాద్ నుంచి వైష్ణోదేవికి భారత్ గౌరవ్ రైలు

సికింద్రబాద్ నుంచి వైష్ణోదేవికి భారత్ గౌరవ్ రైలు

Bharat GouravTrain: సికింద్రాబాద్‌ నుంచి మాతా వైష్ణో దేవి ఆలయం, హరిద్వార్, రిషికేశ్‌ యాత్ర కోసం జూన్‌10న సికింద్రాబాద్‌ నుంచి భారత్ గౌరవ్ రైలు ప్రారంభం అవుతుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైలు ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన యాత్రా స్థలాలను కలుపుతూ పయనిస్తుంది. ఐఆర్‌సిటిసి ఆధ్వర్యంలో కొద్ది నెలల క్రితం ప్రవేశపెట్టిన భారత్ గౌరవ్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో మాతా వైష్ణోదేవి ఆలయ యాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ, మహారాష్ట్రలోని నిర్దేశించిన స్టేషన్లలో ప్రయాణీకులకు ఎక్కేందుకు /దిగే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

Siddipet District : సరిగ్గా చూసుకొని కొడుకు...! కొండగట్టు ఆలయానికి ఆస్తిని రాసిచ్చేందుకు సిద్ధమైన తండ్రి

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..

Arunachalam Tour : ఈ నెలలో 'అరుణాచలం' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? రూ. 7500కే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

TS Model School Results : తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి

దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ‘భారత్ గౌరవ్’ రైలు ఆశించిన ఫలితాలను ఇవ్వడంతో మరిన్ని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ యాత్రలను నిర్వహిస్తోంది. ఇటీవల కాశీతో పాటు పరిసర ప్రాంతాలకు నిర్వహించిన యాత్రలు 100% ఆకుపెన్సీతో నడిచాయి.

ప్రయాణికుల నుండి మంచి ఆదరణ లభించడంతో మరిన్ని యాత్రలకు సిద్ధం అవుతున్నారు. రైలు ప్రయాణీకుల నుండి చక్కటి స్పందన లభించడంతో ఐఆర్‌సిటిసి దేశంలోని ఇతర ప్రసిద్ధ ప్రదేశాలు ముఖ్యమైన యాత్రా స్థలాలను కవర్ చేసేలా కొత్త టూరిస్ట్ సర్క్యూట్‌ కోసం ప్రణాళిక రూపొందించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మొదలయ్యే "మాతా వైష్ణోదేవి, హరిద్వార్ , రిషికేశ్" భారత్ గౌరవ్ పర్యాటక రైలు ప్యాకేజీని ప్రకటించారు. ఈ రైలు ఉత్తర భారత దేశంలోని ముఖ్యమైన యాత్రా స్థలాలు, చారిత్రక ప్రదేశాలను కవర్ చేస్తుంది. తెలంగాణ, మహారాష్ట్రలోని ఏడు ముఖ్యమైన స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కేందుకు / దిగేందుకు సౌకర్యాన్ని కల్పించింది.

“హరిద్వార్, రిషికేశ్‌తో పాటు మాతా వైష్ణోదేవి ఆలయాలకు ప్రయాణించే ఈ టూరిస్ట్ సర్క్యూట్ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట, రామగుండం మరియు సిర్పూర్ ఖగజ్‌నగర్‌లతో పాటు మహారాష్ట్రలోని బల్హర్షా, వార్ధా మరియు నాగ్‌పూర్‌లలో ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎక్కడానికి , దిగడానికి సౌకర్యాన్ని కల్పించింది .

ఈ రైలు కత్రా, ఆగ్రా, మధుర, బృందావన్, కత్రా, హరిద్వార్, రిషికేశ్ వంటి ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తుంది. వైష్ణో దేవి ఆలయం కోసం కాట్రా నుంచి వెళ్లాలనుకునే పర్యాటకులు పోనీ / డోలీ / హెలికాప్టర్ సర్వీస్‌లను వ్యక్తిగతముగా వారే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం యాత్రను 8 రాత్రులు / 9 పగళ్ల కాల వ్యవధిలో ఈ యాత్రను కవర్ చేస్తారు. ప్రయాణీకులకు రైలు ప్రయాణంతో పాటు, వసతి, ఆహారం ఏర్పాట్లు చేస్తారు. రైలు, రోడ్డు రవాణాతో పాటు , వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు చేస్తారు. ప్రయాణంలో ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ అందిస్తారు. ఆన్-బోర్డ్ మరియు ఆఫ్-బోర్డ్ ‌లలో ఈ సదుపాయాలు ఉంటాయి.

పర్యటనలో ప్రొఫెషనల్ టూర్ ఎస్కార్ట్‌ల సేవలు కల్పిస్తారు. రైలులో అన్ని కోచ్‌లలో సి సి టి వి కెమెరాలతో పాటు అన్ని కోచ్‌లలో పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సౌకర్యం ఉంటుంది. మేనేజర్‌ల పర్యవేక్షణలో అందించడం జరుగుతుంది .పూర్తి వివరాల కోసం ఐ ఆర్ సి టి సి వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. బుకింగ్‌తో పాటు మరిన్ని వివరాల కోసం http://www.irctctourism.com  వెబ్‌సైట్‌ లేదా

బుకింగ్ లింక్‌తో: https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG05  ద్వారా బుక్ చేసుకోవచ్చు. వివరాల కోసం సికింద్రాబాద్ ఆఫీస్ ఫోన్ నంబర్‌లలో కూడా సంప్రదించవచ్చు: 9701360701, 8287932228, 9110712752