తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wasim Jaffer Comments On Klrahul Form: ఆ క్రికెట‌ర్స్ కంటే రాహుల్ బెట‌ర్ - వ‌సీం జాఫ‌ర్ కామెంట్స్‌

Wasim Jaffer Comments on KLRahul Form: ఆ క్రికెట‌ర్స్ కంటే రాహుల్ బెట‌ర్ - వ‌సీం జాఫ‌ర్ కామెంట్స్‌

29 October 2022, 9:54 IST

  • Wasim Jaffer Comments on KL Rahul Form: పేల‌వ‌ఫామ్‌తో పాకిస్థాన్‌, నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌ల‌లో త‌క్కువ ప‌రుగుల‌కే ఔట‌య్యాడు కె.ఎల్‌.రాహుల్‌. రెండు మ్యాచ్‌ల‌లో విఫ‌ల‌మైన అత‌డిని తుదిజ‌ట్టులో కొన‌సాగించ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కె.ఎల్‌.రాహుల్‌కు టీమ్ ఇండియా మాజీ క్రికెట‌ర్ వ‌సీం జాఫ‌ర్ మ‌ద్ద‌తుగా నిలిచాడు.

కె.ఎల్ రాహుల్‌
కె.ఎల్ రాహుల్‌

కె.ఎల్ రాహుల్‌

Wasim Jaffer Comments on KL Rahul Form: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో వ‌రుస ఫెయిల్యూర్స్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు టీమ్ ఇండియా ఓపెన‌ర్ కె.ఎల్ రాహుల్‌. పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 ప‌రుగులు చేసిన రాహుల్ నెద‌ర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 9 ర‌న్స్ మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచాడు. అయినా అత‌డిని తుది జ‌ట్టులో కొన‌సాగించ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

రాహుల్‌ను ప‌క్క‌న‌పెట్టాలంటూ ప‌లువురు క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆదివారం సౌతాఫ్రికాతో టీమ్ ఇండియా త‌ల‌ప‌డ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో రాహుల్‌ను తుది జ‌ట్టులో కొన‌సాగిస్తారా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మాత్రం రాహుల్‌పై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నాడు.

మ‌రోసారి అత‌డికి తుది జ‌ట్టులో చోటు ఇవ్వ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో కె.ఎల్ రాహుల్‌పై టీమ్ ఇండియా మాజీ క్రికెట‌ర్ వ‌సీం జాఫ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. రాహుల్ ప్ర‌తిభ‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డానికి వీలులేద‌ని అన్నాడు. అత‌డో అసాధార‌ణ క్రికెట‌ర్ అని వ‌సీంజాఫ‌ర్ పేర్కొన్నాడు. టెస్ట్‌క్రికెట్, టీ20, వ‌న్డేలు అన్ని ఫార్మెట్స్‌కు త‌గ్గ‌ట్టుగా ఆడ‌టం ఎలాగో అత‌డికి బాగా తెలుసున‌ని అన్నాడు.

గాయాల రాహుల్ ఆట‌తీరుపై ప్ర‌భావాన్ని చూపుతున్నాయ‌ని, ఒక‌టి రెండు మ్యాచ్‌ల‌లో విఫ‌ల‌మైతే ప‌క్క‌న‌పెట్టాల‌ని సూచించ‌డంలో అర్థం లేద‌ని వ‌సీంజాఫ‌ర్ చెప్పాడు. రాహుల్ స్థానంలో ఫ‌లానా క్రికెట‌ర్స్ బెస్ట్ అంటూ ఎంతో మంది చెబుతున్నార‌ని, కానీ వారంద‌రితో పోలిస్తే రాహుల్ అత్యుత్త‌మ క్రికెట‌ర్ అని పేర్కొన్నాడు.

ఎప్పుడూ ఒకే రిథ‌మ్‌తో బ్యాటింగ్ చేయ‌డం ఏ క్రికెట‌ర్‌కు సాధ్యం కాద‌ని తెలిపింది. త‌ప్పుకుండా రాహుల్ తిరిగి పుంజుకుంటాడ‌నే న‌మ్మ‌కం ఉంద‌ని వ‌సీంజాఫ‌ర్ పేర్కొన్నాడు.