తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli In Icc Team: ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ బెస్ట్ టీమ్‌లో ముగ్గురు టీమ్ ఇండియా ప్లేయ‌ర్స్‌

Virat Kohli in ICC Team: ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ బెస్ట్ టీమ్‌లో ముగ్గురు టీమ్ ఇండియా ప్లేయ‌ర్స్‌

14 November 2022, 12:31 IST

  • Virat Kohli in ICC Team: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో రాణించిన టీమ్ ఇండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి ఐసీసీ ప్ర‌క‌టించిన వ‌ర‌ల్డ్ క‌ప్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయ‌ర్స్ టీమ్‌లో స్థానాన్ని ద‌క్కించుకున్నాడు. అత‌డితో పాటు సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్య‌ల‌కు జ‌ట్టులో చోటు ద‌క్కింది.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి

Virat Kohli in ICC Team: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు టీమ్ ఇండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి. 296 ర‌న్స్‌తో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో హ‌య్యెస్ట్ స్కోర‌ర్‌గా నిలిచిన కోహ్లి ఐసీసీ ప్ర‌క‌టించిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వాల్యూబుల్ ప్లేయ‌ర్స్ టీమ్‌లో స్థానాన్నిసంపాదించుకున్నాడు. విరాట్ కోహ్లితో పాటు టీమ్ ఇండియా నుంచి సూర్య‌కుమార్ యాద‌వ్ కూడా వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్న‌మెంట్‌లో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ప‌న్నెండో ప్లేయ‌ర్‌గా హార్దిక్ పాండ్య ను ఎంపిక‌య్యాడు. ఈ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కోహ్లి ఆరు మ్యాచుల్లో నాలుగు హాఫ్ సెంచ‌రీల‌తో 296 ర‌న్స్ చేశాడు. మూడు హాఫ్ సెంచ‌రీల‌తో సూర్య‌కుమార్ యాద‌వ్ 239 ర‌న్స్‌తో టాప్ స్కోర‌ర్స్‌లో ఒక‌డిగా నిలిచాడు. ప్ర‌పంచ‌క‌ప్‌లో రాణించిన అన్ని దేశాల ఆట‌గాళ్ల క‌లిపి మోస్ట్ వాల్యూబుల్ ప్లేయ‌ర్స్ టీమ్‌ను ఐసీసీ ప్ర‌క‌టించింది.

ఈ జ‌ట్టులో ఇంగ్లాండ్ నుంచి అలెక్స్ హేల్స్‌, జోస్ బ‌ట్ల‌ర్‌, సామ్ క‌ర‌న్‌, మార్క్ వుడ్ స్థానాన్ని సంపాదించుకున్నారు. పాకిస్థాన్ నుంచి షాబాద్ ఖాన్‌, షాహిన్ అఫ్రిది, జింబాబ్బే నుంచి సికింద‌ర్ ర‌జా చోటు ద‌క్కించుకున్నారు. సౌతాఫ్రికా నుంచి నోర్జ్‌, న్యూజిలాండ్ నుంచి గ్లెన్ ఫిలిప్స్ వాల్యూబుల్ టీమ్ కోసం ఐసీసీ ఎంపిక‌చేసింది. కాగా ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ ఇంగ్లాండ్ విజేత‌గా నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి రెండోసారి క‌ప్‌ను సొంతం చేసుకున్న‌ది.