తెలుగు న్యూస్  /  Sports  /  Virat Kohli Eyes On Sachin Dravid Rare Records In Wtc Final

Virat Kohli Wtc Final Records: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో స‌చిన్‌, ద్రావిడ్ రికార్డుల‌ను కోహ్లి బ్రేక్ చేస్తాడా?

HT Telugu Desk HT Telugu

06 June 2023, 11:26 IST

  • Virat Kohli Wtc Final Records: ఇండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య ఓవ‌ల్ వేదిక‌గా జూన్ 7 నుంచి(రేప‌టి నుండి) డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ స‌మ‌రం జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఫైన‌ల్ ద్వారా స‌చిన్, ద్రావిడ్ రేర్ రికార్డుల‌ను బ్రేక్ చేసే ఛాన్స్‌కు కోహ్లి స‌మీపంలో ఉన్నాడు. ఆ రికార్డులు ఏవంటే...

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి

Virat Kohli Wtc Final Records: జూన్ 7 నుంచి (రేపు) లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా ఇండియా ఆస్ట్రేలియా మ‌ధ్య వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) ఫైన‌ల్ జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఫైన‌ల్‌లో క్రికెట్ అభిమానుల దృష్టి టీమ్ ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు విరాట్ కోహ్లిపైనే ఉంది. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో రెండు సెంచ‌రీలు, ఆరు హాఫ్ సెంచ‌రీల‌తో 639 ర‌న్స్ చేశాడు కోహ్లి. ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక ర‌న్స్ చేసిన బ్యాట్స్‌మెన్స్‌లోమూడో స్థానంలో నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అదే జోరును డ‌బ్యూటీసీ ఫైన‌ల్‌లోనూ కోహ్లి కొన‌సాగించాల‌ని అభిమానులు కోరుకుంటోన్నారు. ఆస్ట్రేలియాపై కోహ్లికి వ్య‌క్తిగ‌తంగా మంచి రికార్డ్ ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆస్ట్రేలియాపై 24 టెస్ట్‌లు ఆడిన కోహ్లి 1979 ర‌న్స్ చేశాడు. అన్ని ఫార్మెట్స్ క‌లిపి ఆస్ట్రేలియాపై 92 మ్యాచులు ఆడిన కోహ్లి 4945 ర‌న్స్ చేశాడు. ఇందులో 16 సెంచ‌రీలు, 24 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

స‌చిన్ రికార్డ్‌...

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ద్వారా దిగ్గ‌జ బ్యాట్స్‌మెన్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డ్‌పై కోహ్లి గురిపెట్టాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఐసీసీ టోర్న‌మెంట్స్‌లో 15 మ్యాచుల్లో కోహ్లి 620 ర‌న్స్ చేశాడు. ఈ జాబితాలో 657 ర‌న్స్‌తో స‌చిన్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. స‌చిన్ రికార్డ్‌కు మ‌రో 37 ప‌రుగుల దూరంలోకోహ్లి నిలిచాడు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌తో స‌చిన్ రికార్డ్‌ను కోహ్లి బ్రేక్ చేయ‌డం ప‌క్కా అని అభిమానులు భావిస్తోన్నారు.

అలాగే ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఇండియ‌న్ బ్యాట్స్‌మెన్‌గా టీమ్ ఇండియా కోచ్ ద్రావిడ్ రికార్డ్‌కు చేరువ‌లో కోహ్లి ఉన్నాడు. ఇంగ్లాండ్ గ‌డ్డపై 46 మ్యాచుల్లో 55 యావ‌రేజ్‌తో 2645 ర‌న్స్ చేశాడు ద్రావిడ్‌. ద్రావిడ్‌ త‌ర్వాత 2626 ర‌న్స్ స‌చిన్ టెండూల్క‌ర్‌ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.

2574 ర‌న్స్‌తో ఈ జాబితాలో కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. మ‌రో 71 ర‌న్స్ చేస్తే ద్రావిడ్‌, స‌చిన్‌ల‌ను వెన‌క్కి నెట్టి కోహ్లి టాప్ ప్లేస్‌లోకి చేరుతాడు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌తో ద్రావిడ్ రికార్డ్‌ను కోహ్లి అధిగ‌మిస్తాడా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.