తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli-anushka Sharma: పారిస్‌లో ఎంజాయ్‌ చేస్తున్న విరాట్‌, అనుష్క

Virat Kohli-Anushka Sharma: పారిస్‌లో ఎంజాయ్‌ చేస్తున్న విరాట్‌, అనుష్క

Hari Prasad S HT Telugu

20 July 2022, 16:24 IST

    • Virat Kohli-Anushka Sharma: వెస్టిండీస్‌ టూర్‌కు రెస్ట్‌ ఇవ్వడంతో విరాట్‌ కోహ్లి మరోసారి వెకేషన్‌కు వెళ్లాడు. ఈ మధ్య ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న విరాట్‌.. కొన్నాళ్లు క్రికెట్‌ ఫీల్డ్‌కు దూరంగా ఉంటే అయినా మళ్లీ గాడిలో పడతాడని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.
భార్య అనుష్క, కూతురు వామికతో విరాట్ కోహ్లి
భార్య అనుష్క, కూతురు వామికతో విరాట్ కోహ్లి (Virat Kohli Instagram)

భార్య అనుష్క, కూతురు వామికతో విరాట్ కోహ్లి

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ టూర్‌లో దారుణంగా విఫలమయ్యాడు టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌కోహ్లి. టెస్ట్‌ రెండు ఇన్నింగ్స్‌తోపాటు, రెండు టీ20లు, రెండు వన్డేల్లో ఒక్కసారి కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో తీవ్ర విమర్శలూ ఎదుర్కొన్నాడు. అతన్ని టీమ్‌లో నుంచి తీసేయాలన్న డిమాండ్లు పెరిగిపోయాయి.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

దీంతో రెస్ట్‌ పేరుతో విరాట్‌ కోహ్లిని వెస్టిండీస్‌ టూర్‌కు దూరంగా ఉంచారు సెలక్టర్లు. ఈ ఖాళీ సమయాన్ని హాయిగా గడపడానికి భార్య అనుష్కశర్మ, కూతురు వామికతో కలిసి పారిస్‌ వెళ్లాడు కోహ్లి. తాము పారిస్‌లో ఉన్న విషయాన్ని అనుష్క ఓ ఫొటో ద్వారా వెల్లడించింది. పనిలోపనిగా యూరప్‌ దేశాల్లో ప్రస్తుతం ఉన్న వేడి గురించి కూడా ఆమె చెప్పింది.

పారిస్‌లో 41 డిగ్రీల ఎండ ఉన్నట్లు ఆమె తన పోస్ట్‌లో చెప్పింది. యూకే, ఫ్రాన్స్‌ సహా పలు యూరప్‌ దేశాలు ఎండ వేడిమికి సతమతమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత ఎండలు యురోపియన్‌ దేశస్థులను బాదేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్‌, అనుష్క వెకేషన్‌ కోసం పారిస్‌ వెళ్లడం విశేషం. గతంలో ఐపీఎల్‌ తర్వాత సౌతాఫ్రికా సిరీస్‌కు రెస్ట్‌ ఇచ్చిన సమయంలోనూ విరాట్‌.. అనుష్కతో కలిసి మాల్దీవ్స్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.

మరోవైపు విరాట్‌ను వెస్టిండీస్‌ టూర్‌కు దూరం పెట్టినా.. ఏషియా కప్‌కు ముందు అతడు ఫామ్‌లోకి రావాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే జింబాబ్వేతో సిరీస్‌లో కోహ్లిని ఆడించాలని సెలక్షన్‌ టీమ్‌ భావిస్తున్నట్లు కమిటీలోని ఓ సభ్యుడు వెల్లడించాడు. ఆగస్ట్‌ చివరి వారంలో ఆసియాకప్‌ ప్రారంభం కానుంది.

<p>తన ఇన్ స్టా స్టోరీలో అనుష్క షేర్ చేసిన ఫొటో</p>