తెలుగు న్యూస్  /  Sports  /  Under 19 Womens World Cup India Beat Sri Lanka By 7 Wickets In Super 6 Round Match

Under 19 Women's World Cup IND vs SA: శ్రీలంక‌పై టీమ్ ఇండియా ఈజీ విక్ట‌రీ

22 January 2023, 20:48 IST

  • Under 19 Women's World Cup IND vs SA: అండ‌ర్ 19 ఉమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా ఆదివారం శ్రీలంక‌పై భార‌త్ ఏడు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక విధించిన 59 ప‌రుగుల టార్గెట్‌ను భార‌త్ ఏడు ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది.

ఇండియా వ‌ర్సెస్ శ్రీలంక‌
ఇండియా వ‌ర్సెస్ శ్రీలంక‌

ఇండియా వ‌ర్సెస్ శ్రీలంక‌

Under 19 Women's World Cup IND vs SA: అండ‌ర్ 19 ఉమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ సూప‌ర్ 6 రౌండ్‌లో టీమ్ ఇండియా తొలి విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఆదివారం శ్రీలంక‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది . ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇర‌వై ఓవ‌ర్ల‌లో 59 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

రాజ‌ప‌క్స 25 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. టీమ్ ఇండియా బౌల‌ర్ పార్ష‌వీ గౌర‌వ్ చోప్రా నాలుగు ఓవ‌ర్లు వేసి ఐదు ర‌న్స్ ఇచ్చి నాలుగు వికెట్లు ద‌క్కించుకున్న‌ది. ఆమె ధాటికి శ్రీలంక టాప్ ఆర్డ‌ర్ విల‌విల‌లాడింది. సంజీవ్ క‌శ్య‌ప్‌ రెండు వికెట్లు తీసుకున్న‌ది. శ్రీలంక విధించిన స్వ‌ల్ప టార్గెట్‌ను టీమ్ ఇండియా 7. 2 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది.

షెఫాలీ వ‌ర్మ 15 ర‌న్స్‌, సంజ‌య్ షెరావ‌ట్ 13 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యారు. సౌమ్య మ‌నీష్ తివారీ 15 బాల్స్‌లో ఐదు ఫోర్ల‌తో 28 ప‌రుగులు చేసి టీమ్ ఇండియాకు విజ‌యాన్ని అందించింది. సూప‌ర్ సిక్స్ రౌండ్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్ ఇండియా ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే.

టాపిక్