తెలుగు న్యూస్  /  Sports  /  Team India Lose The Match By 5 Wickets Against South Africa In T20 World Cup

IND vs SA: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమ్ ఇండియాకు తొలి షాక్‌ - సౌతాఫ్రికా చేతిలో ఓట‌మి

30 October 2022, 20:16 IST

  • IND vs SA: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమ్ ఇండియాకు తొలి ఓట‌మి ఎదురైంది. ఆదివారం సౌతాఫ్రికా చేతిలో ఐదు వికెట్ల తేడాతో రోహిత్ సేన ఓట‌మి పాలైంది.

టీమ్ ఇండియా
టీమ్ ఇండియా

టీమ్ ఇండియా

IND vs SA: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆదివారం సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. స్వ‌ల్ప టార్గెట్‌ను కాపాడుకునేందుకు టీమ్ ఇండియా బౌల‌ర్లు అర్ష‌దీప్‌సింగ్‌, ష‌మీ పోరాడినా ఓట‌మి త‌ప్ప‌లేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శ‌ర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

సూర్య‌కుమార్ యాద‌వ్ మిన‌హా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫ‌లం కావ‌డంతో ఇర‌వై ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు న‌ష్ట‌పోయి టీమ్ ఇండియా 133 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. స్వ‌ల్ప టార్గెట్‌ను ఛేదించేందుకు బ‌రిలో దిగిన సౌతాఫ్రికాకు రెండో ఓవ‌ర్‌లోనే డికాక్‌ను ఔట్ చేసి షాక్ ఇచ్చాడు టీమ్ ఇండియా పేస‌ర్ అర్ష‌దీప్‌సింగ్‌. అదే ఓవ‌ర్‌లో రూసోను పెవిలియ‌న్‌కు పంపించాడు.

ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ప‌డుతోన్న కెప్టెన్ బ‌వుమాను ష‌మీ ఔట్ చేశాడు. 24 ర‌న్స్‌కే మూడు వికెట్లు క‌ష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాను మార్‌క్ర‌మ్‌, మిల్ల‌ర్ క‌లిసి ఆదుకున్నారు. వీరిద్ద‌రు క‌లిసి సౌతాఫ్రికా స్కోరును వంద ప‌రుగులు దాటించారు. ఈ క్ర‌మంలో హాఫ్ సెంచ‌రీ చేసిన మార్‌క్ర‌మ్ ఔట‌య్యాడు. 41 బాల్స్‌లో ఒక సిక్స‌ర్‌, ఆరు ఫోర్ల‌తో 52 ర‌న్స్ చేశాడు.

మార్‌క్ర‌మ్ ఔట్ కాగానే మిల్ల‌ర్ జోరు పెంచాడు. రెండు ఓవ‌ర్ల‌లో 12 ప‌రుగులు చేయాల్సిన త‌రుణంలో స్ట‌బ్స్ ఔట్ కావ‌డంతో మ్యాచ్‌పై ఉత్కంఠ ఏర్ప‌డింది. కానీ మిల్ల‌ర్ మెరుపుల‌తో సౌతాఫ్రికా విజ‌యాన్ని అందుకున్న‌ది. మిల్ల‌ర్ 46 బాల్స్‌లో మూడు సిక్స‌ర్లు, నాలుగు ఫోర్ల‌తో 59 ర‌న్స్‌తో నాటౌట్‌గా మిగిలాడు. టీమ్ ఇండియా బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్ సింగ్‌కు రెండు వికెట్లు, అశ్విన్‌, హార్దిక్ పాండ్య, ష‌మీ త‌లో ఒక వికెట్ తీశారు.