తెలుగు న్యూస్  /  Sports  /  Sunrisers Hyderabad New Jersey Launched Today March 16th Ahead Of Ipl New Season

SunRisers Hyderabad New Jersey: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ చూశారా.. ఏది బాగుంది? కొత్తదా? పాతదా?

Hari Prasad S HT Telugu

16 March 2023, 14:00 IST

    • SunRisers Hyderabad New Jersey: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ చూశారా.. మీకు ఏది నచ్చింది? కొత్తదా లేక పాతదా? ఐపీఎల్ 2023 సీజన్ కోసం సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ ఈ కొత్త జెర్సీని లాంచ్ చేసింది.
కొత్త జెర్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్
కొత్త జెర్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్

కొత్త జెర్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్

SunRisers Hyderabad New Jersey: ఆరెంజ్ ఆర్మీ కొత్త జెర్సీతో కొత్త సీజన్ లో అడుగుపెట్టబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ గురువారం (మార్చి 16) కొత్త జెర్సీ లాంచ్ చేసింది. ఈ విషయాన్ని తన అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా ఆ ఫ్రాంఛైజీ వెల్లడించింది. ఈ కొత్త జెర్సీల్లో సన్ రైజర్స్ ప్లేయర్స్ మయాంక్ అగర్వాల్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ మెరిసిపోయారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ కొత్త జెర్సీలు లాంచ్ చేసిన ఫొటోలను షేర్ చేస్తూ.. "ఇదీ ఆరెంజ్ ఫైర్. త్వరలోనే రైజర్స్ ఈ కొత్త జెర్సీలో ఆడుతుంటే చూడటానికి టికెట్లు ఇప్పుడే కొనుగోలు చేయండి" అని సన్‌రైజర్స్ ఓ క్యాప్షన్ పెట్టింది. మూడు సీజన్ల తర్వాత మళ్లీ హోమ్, అవే పద్ధతిలో మ్యాచ్ లు జరుగుతుండటంతో ఈసారి హైదరాబాద్ మరోసారి ఐపీఎల్ కోసం ముస్తాబవుతోంది.

మార్చి 31న ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 2న సన్ రైజర్స్ తమ తొలి మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో ఈ మ్యాచ్ జరుగుతుంది. గత సీజన్ లో 14 మ్యాచ్ లలో కేవలం ఆరు గెలిచి, 8 ఓడిపోయిన హైదరాబాద్ టీమ్.. పాయింట్ల టేబుల్లో 8వ స్థానంతో సరిపెట్టుకుంది.

ఈసారి తన ఫేట్ ను మార్చుకోవడానికి ఆ టీమ్ ఉబలాటపడుతోంది. గత సీజన్ లో కెప్టెన్ గా ఉన్న విలియమ్సన్ వెళ్లిపోవడంతో ఈసారి కొత్త కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ బరిలోకి దిగుతున్నారు. కొత్త కెప్టెన్, కొత్త జెర్సీ.. మళ్లీ సొంతగడ్డపై మ్యాచ్ లతో 2023లో తమ అదృష్టాన్ని మార్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. సౌతాఫ్రికా లీగ్ అయిన ఎస్ఏ20లో సన్ రైజర్స్ టీమ్ అయిన ఈస్టర్ కేప్ ను మార్‌క్రమ్ విజేతగా నిలిపాడు.

దీంతో అతడిపై హైదరాబాద్ భారీ ఆశలే పెట్టుకుంది. వేలంలో కొత్తగా మయాంక్ అగర్వాల్, ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ లాంటి వాళ్లు జట్టులో చేరారు. దీంతో టీమ్ మరింత బలపడింది. ఇక గత వేలం ప్రారంభానికి ముందు బ్రియాన్ లారా టీమ్ హెడ్ కోచ్ అయ్యాడు. ఇది కూడా జట్టుకు కలిసి వచ్చేదే.

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఇదే

హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసేన్, ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే, వివ్రాంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, సన్వీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, మయాంక్ దాగార్, నితీష్ కుమార్ రెడ్డి, అకీల్ హుస్సేన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, అబ్దుల్ సమద్, ఏడెన్ మార్‌క్రమ్, రాహుల్ త్రిపాఠీ, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్ హక్ ఫరూకీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

టాపిక్