తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Afg Vs Sl Odi: ఆఫ్ఘ‌నిస్తాన్ పై రివేంజ్ తీర్చుకున్న శ్రీలంక - రెండో వ‌న్డేలో భారీ విజ‌యం

AFG vs SL Odi: ఆఫ్ఘ‌నిస్తాన్ పై రివేంజ్ తీర్చుకున్న శ్రీలంక - రెండో వ‌న్డేలో భారీ విజ‌యం

HT Telugu Desk HT Telugu

05 June 2023, 7:16 IST

  • AFG vs SL Odi: ఆదివారం జ‌రిగిన రెండో వ‌న్డేలో ఆఫ్ఘనిస్తాన్‌పై శ్రీలంక 132 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. తొలి వ‌న్డేలో ఎదురైన ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకున్న‌ది శ్రీలంక‌.

శ్రీలంక వ‌ర్సెస్ ఆఫ్ఘ‌నిస్తాన్‌
శ్రీలంక వ‌ర్సెస్ ఆఫ్ఘ‌నిస్తాన్‌

శ్రీలంక వ‌ర్సెస్ ఆఫ్ఘ‌నిస్తాన్‌

AFG vs SL Odi: తొలి వ‌న్డేలో ఆఫ్ఘ‌నిస్తాన్ చేతిలో ఎదురైన ప‌రాభ‌వంపై శ్రీలంక ప్ర‌తీకారం తీర్చుకున్న‌ది. ఆదివారం జ‌రిగిన రెండో వ‌న్డేలో ఆఫ్ఘ‌నిస్తాన్‌ను 132 ప‌రుగుల తేడాతో శ్రీలంక చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక యాభై ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు న‌ష్ట‌పోయి 323 ప‌రుగులు చేయ‌గా ల‌క్ష్య‌ఛేద‌న‌లో త‌డ‌బ‌డిన ఆఫ్ఘ‌నిస్తాన్ 191 ప‌రుగుల‌కే ఆలౌటైంది. రెండో వ‌న్డేలో శ్రీలంక బ్యాట్స్‌మెన్స్ స‌మిష్టిగా రాణించారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఓపెన‌ర్లు నిస్సాంక 43 ప‌రుగులు చేయ‌గా క‌రుణ‌ర‌త్నే 52 ర‌న్స్ చేశాడు. ఆ జోరును స‌మ‌ర‌విక్ర‌మ‌తో (44 ర‌న్స్‌) క‌లిసి కుశాల్ మెండిస్ కొన‌సాగించాడు. ఆఫ్ఘ‌న్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న కుశాల్ మెండిస్ 75 బాల్స్‌లో ఏడు ఫోర్లు ఒక సిక్స‌ర్‌తో 78 ర‌న్స్ చేశాడు.

చివ‌ర‌లో హ‌స‌రంగా (12 బాల్స్‌లో 29 ర‌న్స్‌), ష‌న‌క (13 బాల్స్‌లో23 ర‌న్స్‌) చేయ‌డంతో శ్రీలంక 323 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. భారీ టార్గెట్‌తో బ‌రిలో దిగిన ఆఫ్ఘ‌నిస్తాన్ 42 ఓవ‌ర్ల‌లో 191 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. ఇబ్ర‌హీం జ‌ర్దాన్ (54 ర‌న్స్‌), హ‌స్మ‌తుల్లా షాహిదీ(57 ర‌న్స్‌)తో బ్యాటింగ్‌లో రాణించారు.

ఒక ద‌శ‌లో మ‌రోసారి అద్భుత చేసేలా ఆఫ్ఘ‌నిస్తాన్ క‌నిపంచింది. కానీ శ్రీలంక బౌల‌ర్లు హ‌స‌రంగ‌, ధ‌నుంజ‌య డిసిల్లా స్పిన్‌ ధాటికి ఆఫ్ఘ‌న్ బ్యాట్స్‌మెన్ పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. దాంతో ఆఫ్ఢ‌న్ ఓట‌మి ఖాయ‌మైంది. . మూడు వ‌న్డేల సిరీస్‌లో శ్రీలంక‌, ఆఫ్ఘ‌నిస్తాన్ 1-1తో స‌మంగా ఉన్నాయి. నిర్ణ‌యాత్మ‌క మూడో వ‌న్డే జూన్ 7న బుధ‌వారం జ‌రుగ‌నుంది.