తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Sa 2nd Odi: రెండో వ‌న్డేలో టీమ్ ఇండియా టార్గెట్ 279 - సిరాజ్‌కు మూడు వికెట్లు

IND vs SA 2nd Odi: రెండో వ‌న్డేలో టీమ్ ఇండియా టార్గెట్ 279 - సిరాజ్‌కు మూడు వికెట్లు

09 October 2022, 17:26 IST

  • IND vs SA 2nd Odi: రెండో వ‌న్డేలో టీమ్ ఇండియా ముందు సౌతాఫ్రికా 278 ప‌రుగుల భారీ టార్గెట్‌ను విధించింది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్‌లో హెండ్రిక్స్‌, మార్‌క్ర‌మ్ హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు.

మ‌హ్మ‌ద్ సిరాజ్‌
మ‌హ్మ‌ద్ సిరాజ్‌ (Twitter)

మ‌హ్మ‌ద్ సిరాజ్‌

IND vs SA 2nd Odi: రాంచీ వేదిక‌గా ఆదివారం జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో సౌతాఫ్రికా యాభై ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 278 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. ఫామ్‌లో ఉన్న‌ వికెట్ కీప‌ర్ డికాక్‌ను తొంద‌ర‌గా ఔట్ చేసి సిరాజ్ టీమ్ ఇండియా లో ఆనందాన్ని నింపాడు. మ‌రో ఓపెన‌ర్ మ‌లాన్ కూడా 25 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

40 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాకు హెండ్రిక్స్‌, మార్‌క్ర‌మ్ క‌లిసి ఆదుకున్నారు. టీమ్ ఇండియా బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటూ వీరిద్ద‌రు మూడో వికెట్‌కు 129 ప‌రుగులు భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.

ప్ర‌మాద‌క‌రంగా మారిన ఈ జోడిని సిరాజ్ విడగొట్టాడు. హెండ్రిక్స్‌ను ఔట్ చేశాడు. 76 బాల్స్‌లో ఒక సిక్స‌ర్‌, తొమ్మిది ఫోర్ల‌తో 74 ప‌రుగులు చేశాడు హెండ్రిక్స్‌. మార్‌క్ర‌మ్‌ను సుంద‌ర్ పెవిలియ‌న్‌కు పంపించాడు. 89 బాల్స్‌లో ఒక సిక్స‌ర్‌, ఏడు ఫోర్ల‌తో 79 ర‌న్స్ చేశాడు మార్‌క్ర‌మ్‌.

క్లాసెన్ (30 ర‌న్స్‌) మిల్ల‌ర్ (35 ప‌రుగులు నాటౌట్‌) ధాటిగా ఆడ‌టంతో సౌతాఫ్రికా 278 ప‌రుగులు చేసింది.. ఆరంభంలో విఫ‌ల‌మైన‌ టీమ్ ఇండియా బౌల‌ర్లు చివ‌ర‌లో క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. టీమ్ ఇండియా బౌల‌ర్ల‌లో సిరాజ్ మూడు వికెట్లు, సుంద‌ర్‌, షాబాజ్ అహ్మ‌ద్‌, కుల్దీప్ యాద‌వ్‌, శార్ధూల్ ఠాకూర్ త‌లో ఒక్క వికెట్ తీశారు.