తెలుగు న్యూస్  /  Sports  /  Sourav Ganguly Meets Bengal Cm Mamata Banerjee

Sourav Ganguly Meets Mamata Banerjee : మమతా బెనర్జీతో గంగూలీ భేటీ.. రాజకీయాల్లోకి దాదా!

Anand Sai HT Telugu

16 January 2023, 22:30 IST

    • Sourav Ganguly Meets Bengal CM Mamata Banerjee : టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి వస్తాడని పశ్చిమ బెంగాల్‌లో ఊహాగానాలు జోరందుకున్నాయి. సీఎం మమతా బెనర్జీని గంగూలీ కలవడంపై క్యూరియాసిటీని కలిగిస్తోంది.
మమతతో సౌరవ్ గంగూలీ(ఫైల్ ఫొటో)
మమతతో సౌరవ్ గంగూలీ(ఫైల్ ఫొటో)

మమతతో సౌరవ్ గంగూలీ(ఫైల్ ఫొటో)

టీమిండియా(Team India) మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. సీఎం కార్యాలయానికి చేరుకున్న దాదా సుమారు 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అయితే ఈ పర్యటన ఉద్దేశమేమిటో ఇంకా వెల్లడికాలేదు. సౌరవ్ గంగూలీ కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ భేటీ వెనక రాజకీయ చర్చలు మొదలయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్ సీఎం కార్యాలయంలో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. మమతా బెనర్జీ(Mamata Banerjee)ని గతంలో చాలాసార్లు కలిశారు. అయితే ఈ భేటీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఎందుకంటే దాదా రాజకీయాల్లోకి వస్తాడనే ఊహాగానాలు పశ్చిమ బెంగాల్‌లో జోరందుకున్నాయి. సౌరవ్ గంగూలీ మమతా బెనర్జీని కలవడంపై క్యూరియాసిటీని కలిగిస్తోంది.

ముఖ్యమంత్రి తనకు చాలా సన్నిహితంగా ఉంటారని దాదా తెలిపాడు. ఆమె తనకు తల్లిలాంటిదని వెల్లడించాడు. మమతా బెనర్జీ అంటే తనకు చాలా గౌరవం ఉందని చెప్పాడు. BCCI అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ గత సంవత్సరం అధ్యక్ష పదవి నుండి తప్పుకొన్నాడు. . దీనిపై మమతా బెనర్జీ కూడా స్పందించారు. ఐసీసీ అధ్యక్ష పదవికి గంగూలీ పోటీ చేసేందుకు అనుమతించాలని అభ్యర్థించారు.

'ప్రధానమంత్రికి నా అభ్యర్థన. దయచేసి సౌరవ్‌ను ఐసీసీ(ICC) ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించండి.' అని మమతా బెనర్జీ బహిరంగంగా అభ్యర్థించారు. అయితే, దీనిపై అనుమతి ఇవ్వకపోవడంపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సౌరవ్ గంగూలీ.. బెంగాల్ కుమారుడైనందునే తనను ఐసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయలేదని ఆరోపించారు.

అయితే మమత పిలుపు మేరకు గంగూలీ వెళ్లి తాజాగా ఆమెను కలిసినట్టుగా తెలుస్తోంది. వీరు కలవడం ఏడాది వ్యవధిలో రెండోసారి. గంగూలీ 49వ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు జులై 2021లో మమతా దాదా ఇంటికి వెళ్లారు. కిందటి ఏడాది మేలో కేంద్ర హోంశాఖ అమిత్ షా(amit shah)కు గంగూలీ తన నివాసంలో ఇచ్చాడు. గంగూలీ రాజకీయాల్లోకి వస్తున్నాడని వార్తలు జోరుగా వచ్చాయి. అమిత్ షా తనయుడు జై షాతో 2008 నుంచి కలిసి పని చేస్తున్నానని, అమిత్ షా కూడా తనకు తెలుసని గంగూలీ చెప్పాడు. ఈ వార్తలను అతడు ఖండించాడు.