తెలుగు న్యూస్  /  Sports  /  Shubman Gill On Dating Sara Ali Khan Says May Be

Shubman Gill on Dating Sara Ali Khan: అవును సారాతో డేటింగ్‌లో ఉన్నా: శుభ్‌మన్‌ గిల్

Hari Prasad S HT Telugu

15 November 2022, 16:50 IST

    • Shubman Gill on Dating Sara Ali Khan: అవును సారాతో డేటింగ్‌లో ఉన్నానని చెప్పాడు టీమిండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌. అతని కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.
శుభ్‌మన్‌ గిల్‌, సారా అలీ ఖాన్
శుభ్‌మన్‌ గిల్‌, సారా అలీ ఖాన్

శుభ్‌మన్‌ గిల్‌, సారా అలీ ఖాన్

Shubman Gill on Dating Sara Ali Khan: టీమిండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌, బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి. ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని ఇప్పటికే ఎన్నోసార్లు పుకార్లు వినిపించాయి. అయితే అవి పుకార్లు కావు నిజమే అని శుభ్‌మన్‌ గిల్ తేల్చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో గిల్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. సోనమ్‌ బజ్వాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు.. సారాతో డేటింగ్‌ విషయంపై అడిగినప్పుడు రెండు ముక్కల్లో సమాధానమిచ్చాడు. సోనమ్‌ బజ్వాకు చెందిన పాపులర్‌ పంజాబీ చాట్‌ షో దిల్‌ దియా గల్లాన్‌ సీజన్‌ 2కు శుభ్‌మన్‌ గిల్‌ స్పెసల్ గెస్ట్‌గా వచ్చాడు.

దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో చాలా ఫిట్‌గా ఉన్న బాలీవుడ్‌ ఫిమేల్‌ యాక్టర్‌ ఎవరు అని శుభ్‌మన్‌ను సోనమ్‌ అడిగింది. అతడు మరో ఆలోచన లేకుండా సారా అని చెప్పడం విశేషం. ఇక ఇదే షోలో తర్వాత నువ్వు సారాతో డేటింగ్‌లో ఉన్నావా అని కూడా సోనమ్‌ అతన్ని ప్రశ్నించింది. దీనికి అతడు స్పందిస్తూ.. ఉండొచ్చు అని అన్నాడు.

దీంతో సోనమ్‌ నవ్వుతూ నిజం చెప్పుడు అని మరోసారి అడిగింది. శుభ్‌మన్‌ స్పందిస్తూ.. నిజంగానే నిజం చెబుతున్నాను అని ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని శుభ్‌మన్‌ చాలా తెలివిగా సమాధానమిచ్చాడు. శుభ్‌మన్‌, సారా అలీ ఖాన్‌ తొలిసారి ఈ ఏడాది ఆగస్ట్‌లో కలిసి కనిపించారు. ముంబైలోని వర్లీలో ఉన్న పాపులర్‌ రెస్టారెంట్‌లో ఈ ఇద్దరూ లంచ్‌ చేస్తున్న ఫొటోను టిక్‌టాక్ యూజర్‌ ఉజ్మా మర్చంట్‌ షేర్‌ చేసింది.

ఈ ఫొటో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు క్రికెటర్‌ శుభ్‌మన్‌, యాక్టర్‌ సారా ఎలా కలిశారన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అంతకుముందు సచిన్‌ కూతురు సారాతోనూ శుభ్‌మన్‌ డేటింగ్‌ చేస్తున్నాడన్న వార్తలు వచ్చాయి. ఇక గత అక్టోబర్‌లోనూ మరోసారి శుభ్‌మన్‌, సారా అలీ ఖాన్‌ కలిసి కనిపించడంతో వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న అనుమానాలు మరింత బలపడ్డాయి.

వీళ్లు ఒకే హోటల్‌ నుంచి బయటకు వస్తూ కనిపించడంతోపాటు ఒకే విమానం ఎక్కారు. దీంతో వీళ్లు డేటింగ్‌లో ఉన్నట్లు ఫ్యాన్స్‌ ఫిక్సయిపోయారు. అయితే తమ రిలేషన్‌షిప్‌పై శుభ్‌మన్‌ తొలిసారి స్పందించాడు. కానీ ఏ విషయాన్నీ అతడు కచ్చితంగా చెప్పకుండా తెలివిగా సమాధానమిచ్చాడు.