తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shane Watson On Kohli: కోహ్లి వంద సెంచ‌రీలు చేస్తాడు - ఆసీస్ ఆల్‌రౌండ‌ర్ జోస్యం

Shane Watson on Kohli: కోహ్లి వంద సెంచ‌రీలు చేస్తాడు - ఆసీస్ ఆల్‌రౌండ‌ర్ జోస్యం

21 March 2023, 10:48 IST

  • Shane Watson on Kohli: ఇంట‌ర్‌నేష‌న్ క్రికెట్‌లో కోహ్లి వంద సెంచ‌రీలు చేస్తాడ‌ని ఆసీస్ మాజీ ఆల్ రౌండ‌ర్ షేన్ వాట్స‌న్ అన్నాడు. కోహ్లి ఎంత గొప్ప ఆట‌గాడ‌న్న‌ది అత‌డి రికార్డులే చెబుతాయ‌ని వాట్స‌న్ తెలిపాడు.

కోహ్లి
కోహ్లి

కోహ్లి

Shane Watson on Kohli: అంత‌ర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచ‌రీలు సాధించే స‌త్తా స‌మ‌కాలీన క్రికెట‌ర్ల‌లో విరాట్ కోహ్లికి మాత్ర‌మే ఉంద‌ని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండ‌ర్ షేన్ వాట్స‌న్ అన్నాడు. ఇటీవ‌ల ఆస్ట్రేలియాతో జ‌రిగిన బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ టెస్ట్ సిరీస్‌లో కోహ్లి చ‌క్క‌టి ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రిచాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

చివ‌రి టెస్ట్‌లో సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. 2019లో టెస్టుల్లో చివ‌రి సెంచ‌రీ చేసిన కోహ్లి దాదాపు 1200 రోజుల త‌ర్వాత మూడెంక‌ల స్కోరును అందుకున్నాడు. మొత్తంగా మూడు ఫార్మెట్స్‌లో క‌లిపి కోహ్లి 75 సెంచ‌రీలు చేశాడు. కోహ్లిపై ఆసీస్ మాజీ క్రికెట‌ర్ షేన్ వాట్స‌న్ ప్ర‌శంస‌లు కురిపించాడు. స‌మ‌కాలీన క్రికెట‌ర్ల‌లో వంద సెంచ‌రీలు మైలురాయిని అందుకునే అవ‌కాశాలు కోహ్లికే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వాట్స‌న్ పేర్కొన్నాడు.

విరాట్ ఎంత గొప్ప ఆట‌గాడ‌న్న‌ది అత‌డి రికార్డులే చెబుతాయ‌ని తెలిపాడు. భ‌విష్య‌త్తులో ఎవ‌రికి సాధ్యం కానీ ఎన్నో ఘ‌న‌త‌ల్ని కోహ్లి అందుకుంటాడ‌ని చెప్పాడు. కోహ్లి ఫామ్‌ను చూస్తుంటే సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడే సామ‌ర్థ్యాలు అత‌డిలో క‌నిపిస్తున్నాయ‌ని వాట్స‌న్ తెలిపాడు.

అద్భుత‌మైన క్లాస్ ప్లేయ‌ర్స్‌లో కోహ్లి ఒక‌డ‌ని చెప్పాడు. టెస్టుల్లో సెంచ‌రీ చేయ‌డానికి నాలుగేళ్లు టైమ్ తీసుకున్న అత‌డు ఈ సారి మాత్రం అంత‌గా స‌మ‌యం తీసుకోక‌పోవ‌చ్చున‌ని, కోహ్లి నుంచి త్వ‌ర‌లోనే మ‌రో భారీ ఇన్నింగ్స్‌ను అభిమానులు చూడొచ్చ‌ని షేన్ వాట్స‌న్ అన్నాడు.