తెలుగు న్యూస్  /  Sports  /  Sarfaraz Khan Not Selected In India's Squad For Australia Test See Here How Cricket Lovers Reacts

Sarfaraz Khan : సర్ఫరాజ్ ఖాన్​ను తీసుకోకపోవడం షేమ్.. షేమ్

Anand Sai HT Telugu

14 January 2023, 9:52 IST

    • Team India Squad : న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగే టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్ ను తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
సర్ఫరాజ్ ఖాన్
సర్ఫరాజ్ ఖాన్

సర్ఫరాజ్ ఖాన్

IND Vs AUS Test Series : న్యూజిలాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్, ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. 25 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)ను ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అయితే ఇది భారత క్రికెట్ అభిమానులకు నచ్చలేదు. ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌ జరగనుంది. సర్ఫరాజ్ ఖాన్ ఎంపిక కాకపోవడంతో అభిమానులు హర్ట్ అయ్యారు. దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ అద్భుతమైన పరుగులు చేశాడు. సెలక్షన్ కమిటీ దృష్టిలో కూడా పడ్డాడు. కానీ ఎంపిక చేయడం మాత్రం దోబూచులాడుతూనే ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఐదు మ్యాచ్‌లలో 431 పరుగులు నమోదు చేశాడు సర్ఫరాజ్. రెండు సెంచరీలు, అర్ధ సెంచరీ ఉన్నాయి. గత సీజన్‌లో ఆరు మ్యాచ్‌ల్లో 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు ఉన్నాయి. సర్ఫరాజ్ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని సూర్యకుమార్(Surya Kumar) లేదా కిషన్‌కు బదులుగా పంపిస్తారని చాలామంది అభిమానులు ఎదురుచూశారు. కానీ నిరాశ ఎదురైంది. దీంతో సోషల్ మీడియా(Social Media)లో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

2014లో అరంగేట్రం చేసినప్పటి నుంచి 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 12 సెంచరీలు, తొమ్మిది అర్ధసెంచరీలతో 80.47 సగటుతో 3380 పరుగులు చేశాడు సర్ఫరాజ్. సూర్యకుమార్ యాదవ్‌(Surya Kumar Yadav)ను ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ కు భారత్ ఎంపిక చేసింది. KS భరత్‌, కిషన్ ను కీపర్‌గా ఎంపిక చేశారు. రిషబ్ పంత్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంతో ఇది జరిగిందని అర్థమవుతోంది. సర్ఫరాజ్ కంటే సూర్యకుమార్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.

'సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ లేని వ్యక్తి సర్ఫరాజ్. పేదవాడు.. జట్టులో ఉండటానికి కావలసినదానికంటే ఎక్కువ చేశాడు. ఇలా అవమానం చేయడం సరికాదు.' అని ఒకరు ట్వీట్ చేశారు.

వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా సర్ఫరాజ్‌ను ఎంపిక చేయనందుకు బాధపడ్డాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడని పేర్కొన్నాడు. మీరు అతని కంటే ఎక్కువ చేయలేరని తెలిపాడు. టెస్టుల్లో సర్ఫరాజ్ ఖాన్ కంటే ముందుగా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయడం రంజీ ట్రోఫీని అవమానించడమేనని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

India’s Squad For First 2 Tests vs Australia :

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, సి పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్