తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sarfaraz Khan : సచిన్ కొడుకుతో పోల్చుకున్న సర్ఫరాజ్.. అర్జున్ కన్నా నేనే లక్కీ

Sarfaraz Khan : సచిన్ కొడుకుతో పోల్చుకున్న సర్ఫరాజ్.. అర్జున్ కన్నా నేనే లక్కీ

Anand Sai HT Telugu

23 January 2023, 8:43 IST

    • Sarfaraz Khan Comparision : ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సర్ఫరాజ్ ఖాన్. దేవవాళీ క్రికెట్లో పరుగులు భారీగా సాధిస్తున్నాడు. టీమిండియాలోకి ఎంట్రీ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు.
సర్ఫరాజ్ ఖాన్
సర్ఫరాజ్ ఖాన్

సర్ఫరాజ్ ఖాన్

ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ కు సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) ఎంపిక అవుతాడని అంతా భావించారు. అతడిని పక్కన పెట్టేసి.. సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav), ఇషాన్ కిషన్ లాంటి వారిని ఎంపిక చేశారు. దీనిపై చాలామంది విమర్శలు గుప్పించారు. సర్ఫరాజ్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. టీమిండియా(Team India) సెలక్షన్ కమిటీ మీద కామెంట్స్ చేశాడు. బంగ్లాదేశ్ సిరీస్ కు ఎంపిక చేస్తానని మాటిచ్చి.. ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చారని సర్ఫరాజ్ చెప్పుకొచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ కామెంట్స్ సర్ఫరాజ్ నుంచి వచ్చిన తర్వాత.. క్రికెట్ అభిమానులు(Cricket Fans) కూడా సెలక్షన్ కమిటీపై మండిపడ్డారు. అయితే ఆస్ట్రేలియా సిరీస్ కు టీమిండియాను ప్రకటించిన సమయంలోనే రంజీ ట్రోఫీలో మరో సెంచరీ బాదాడు సర్ఫరాజ్. ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకైనా ఎంపిక చేస్తారని ఎదురుచూస్తున్నారు.

అయితే మరోవైపు ఇటీవలే సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) తండ్రి నౌషద్ ఖాన్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. చిన్న చిన్న పనులు చేస్తూ.. సర్ఫరాజ్ ను క్రికెటర్(Cricketer)ను చేశాడు. ఎంతో కష్టపడి కొడుకును ఇంత దూరం తీసుకొచ్చినట్టుగా తెలిపాడు. అయితే ఒకానొక సమయంలో సర్ఫరాజ్ అన్న మాటలను ఇంటర్వ్యూలో తండ్రి గుర్తు చేసుకున్నాడు. తనకు నోట మాట రాలేదని చెప్పాడు. సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కుమారుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar)తో సర్ఫరాజ్ చిన్నతనంలో ఎక్కువగా క్రికెట్ ఆడేవాడు. సర్ఫరాజ్.. తన తండ్రి నౌషద్ కు ఒక్కసారి అర్జున్ గురించి చెప్పాడట..

'అర్జున్ టెండూల్కర్ ఎంత లక్కీనో కదా నాన్న. తను సచిన్ కొడుకు. అతడి దగ్గర అన్నీ ఉన్నాయి. కార్లు, ఐప్యాడ్లు. అన్నీ ఉన్నా.. వాళ్ల నాన్న అర్జున్ తో ఎక్కువ సేపు గడపలేడు. కానీ నువ్ మాత్రం నాతో రోజంతా గడుపుతావు. నేనే అర్జున్ కన్నా లక్కీ కదా' అని తండ్రితో సర్ఫరాజ్ అన్నాడట. ఈ విషయాన్ని అతడి తండ్రి నౌషద్ ఒ ఇంటర్వ్యూలో చెప్పాడు.

టాపిక్