తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Saba Karim Comments On Rahul Dravid: రాహుల్‌కు కష్టకాలం ప్రారంభం.. హనీమూన్ పీరియడ్ అయిపోయింది.. భారత మాజీ సెలక్టర్

Saba Karim Comments on Rahul Dravid: రాహుల్‌కు కష్టకాలం ప్రారంభం.. హనీమూన్ పీరియడ్ అయిపోయింది.. భారత మాజీ సెలక్టర్

10 September 2022, 13:51 IST

    • Rahul dravid Honeymoon Period Over: భారత మాజీ సెలక్టర్ సబా కరీమ్ రాహుల్ ద్రవిడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడి హనీమూన్ పీరియడ్ ముగిసిందని స్పష్టం చేశారు. ఈ విషయం ద్రవిడ్‌కు కూడా తెలుసని స్పష్టం చేశారు.
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ (HT)

టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్

Saba karim About Rahul Dravid: ఆసియా కప్ 2022లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. కనీసం ఫైనల్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పాకిస్థాన్, శ్రీలంక చేతిలో ఓటమి పాలై ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లుకున్న టీమిండియా.. ఆఫ్గానిస్థాన్‌పై విజయం సాధించి పరువు దక్కించుకుంది. ఈ టోర్నీలో అనవసర తప్పిదాలు, జట్టు ఎంపికలో పొరపాట్లు చేసి మూల్యం చెల్లించుకున్న రోహిత్ సేనపై విమర్శలు తలెత్తాయి. పలువురు మాజీలతో పాటు ప్రేక్షకులు కూడా జట్టు ఎంపికపై నోరెళ్లబెట్టారు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రవిడ్‌కు హనీమూన్ పీరియడ్ అయిపోయిందని వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"ఆసియా కప్‌లో టీమిండియా ప్రదర్శన ద్రవిడ్‌కు కష్టకాలం తెచ్చిపెట్టింది. భవిష్యత్తులో అతడు మరిన్ని కఠిన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రానున్న రెండు మెగా ఐసీసీ ఈవెంట్లలో గెలిస్తేనే కోచ్‌గా అతడికి సంతృప్తి దొరుకుతుంది. ద్రవిడ్‌కు హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఈ విషయం అతడికి కూడా బాగా తెలుసు. జట్టును అత్యుత్తమ స్థితిలో ఉంచేందుకు తన వంతు కృషి చేస్తున్నప్పటికీ అతడి ప్రయత్నాలు సరిపోవడం లేదు. రాహుల్‌కు నిజంగా ఇది కష్ట కాలం." అని సబా కరీం స్పష్టం చేశారు.

ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లకు రాహుల్ ద్రవిడ్ దూరమయ్యాడు. అయితే అతడి కోచింగ్‌లో టీమిండియా ఆడిన పెద్ద టోర్నీ ఇదే కావడంతో అందరి చూపులు ద్రవిడ్‌పైనే ఉన్నాయి. ఆసియా కప్ ఓటమి నుంచి తేరుకుని రానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌పై దృష్టి సారించాల్సిందిగా టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.

ఇప్పటికే ఆసియా కప్ ఫైనల్ చేరడంలో టీమిండియా ప్రయాణం ముగిసింది. సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్, శ్రీలంక చేతిలో పరజాయం పాలై.. తన ప్రయాణాన్ని ముగించింది. అయితే ఆసియా కప్‌లో తన చివరి మ్యాచ్‌ను ఆఫ్గానిస్థాన్‌తో ఆడి విజయం సాధించి పరువు దక్కించుకుంది.