తెలుగు న్యూస్  /  Sports  /  Rohit Sharma To Set A World Record Against Australia In T20 Series

Rohit Sharma to set World Record: మరో వరల్డ్‌ రికార్డుపై కన్నేసిన రోహిత్‌.. ఆస్ట్రేలియాపై కొట్టేస్తాడా?

Hari Prasad S HT Telugu

19 September 2022, 19:39 IST

    • Rohit Sharma to set World Record: మరో వరల్డ్‌ రికార్డుపై కన్నేశాడు రోహిత్‌ శర్మ. ఆస్ట్రేలియాతో మంగళవారం (సెప్టెంబర్‌ 20) జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లోనే అతడు ఈ రికార్డు క్రియేట్‌ చేసే అవకాశం ఉంది.
మొహాలీలో ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
మొహాలీలో ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

మొహాలీలో ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

Rohit Sharma to set World Record: ఇండియన్‌ టీమ్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో వరల్డ్‌ రికార్డుకు చేరువలో ఉన్నాడు. సిక్సర్లను అవలీలగా బాదుతూ హిట్‌ మ్యాన్‌గా పేరు సంపాదించిన రోహిత్‌.. ఇప్పుడా సిక్సర్లతోనే వరల్డ్‌ రికార్డు క్రియేట్‌ చేసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో మంగళవారం (సెప్టెంబర్‌ 20) జరగబోయే తొలి టీ20లోనే ఈ రికార్డును అందుకునే వీలుంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ మంగళవారం మొహాలీలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ రెండు సిక్స్‌లు బాదితే చాలు వరల్డ్‌ రికార్డు అతని సొంతమవుతుంది. ప్రస్తుతం టీ20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లలో 172 సిక్స్‌లతో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్‌ గప్టిల్‌ టాప్‌లో ఉన్నాడు. అతని తర్వాతి స్థానం రోహిత్‌దే.

రోహిత్‌ శర్మ 171 సిక్స్‌లతో ఉన్నాడు. ఒక్క సిక్స్‌ కొడితే గప్టిల్‌ను సమం చేసే అతడు.. రెండు సిక్స్‌లు బాదితే వరల్డ్‌ రికార్డు అందుకుంటాడు. ఈ ఇద్దరి తర్వాత వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్‌ క్రిస్‌ గేల్ 124 సిక్స్‌లతో మూడోస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఇయాన్‌ మోర్గాన్‌ (120), ఆరోన్‌ ఫించ్‌ (117) ఉన్నారు. ఈ ఏడాది రోహిత్‌ పెద్దగా ఫామ్‌లో లేడు.

17 మ్యాచ్‌లలో 26.43 సగటుతో 423 రన్స్‌ మాత్రమే చేశాడు. అందులో రెండు హాఫ్‌ సెంచరీలు ఉండగా.. స్ట్రైక్‌రేట్‌ 143గా ఉంది. ఇక ఈ ఏడాది అతడు 21 సిక్స్‌లు బాదాడు. ఇప్పుడు సొంతగడ్డపై మొదట ఆస్ట్రేలియా, తర్వాత సౌతాఫ్రికాలతో ఇండియా టీ20 సిరీస్‌లు ఆడనుంది. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఈ రెండు సిరీస్‌లు టీమిండియాకు, కెప్టెన్‌ రోహిత్‌కు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

ఆస్ట్రేలియాతో మొహాలీ, నాగ్‌పూర్‌, హైదరాబాద్‌లలో మూడు టీ20లు జరగనున్నాయి. ఇక ఆ తర్వాత సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు జరుగుతాయి. ఈ సిరీస్‌ల తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఆస్ట్రేలియాకు వెళ్తుంది టీమిండియా. వచ్చేనెల 23న మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌తో తన తొలి మ్యాచ్‌ ఆడుతుంది.