తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Available In 2nd Odi: రెండో వన్డేకు రోహిత్ శర్మ.. మరి తుది జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారు?

Rohit available in 2nd ODI: రెండో వన్డేకు రోహిత్ శర్మ.. మరి తుది జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారు?

18 March 2023, 19:30 IST

    • Rohit available in 2nd ODI: టీమిండియా కెప్టెన్ రోహిత శర్మ రెండో వన్డేకు అందుబాటులోకి రానున్నాడు. వైజాగ్ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్‌కు రానున్నాడు. అతడు రాకతో తుది జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తి నెలకొంది.
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (AP)

రోహిత్ శర్మ

Rohit available in 2nd ODI: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ఇప్పటికే ముందంజలో ఉంది. ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కేఎల్ రాహుల్(75) అద్భుత అర్ధశతకానికి తోడు రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్నారు. ఇదే విజయాన్ని రెండో వన్డేలోనూ చూపించాలని టీమిండియా భావిస్తోంది. ఇదిలా ఉంటే తొలి వన్డేకు గైర్హాజరైన టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ.. రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

తన బావమరిది పెళ్లి కారణంగా తొలి వన్డేకు దూరమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో చేరేందుకు సిద్ధమయ్యాడట. రెండో వన్డేలో హిట్ మ్యాన్ ఆడితే తుది జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారనే ఆసక్తిగా మారింది. తొలి మ్యాచ్‌లో సత్తా చాటిన కేఎల్ రాహుల్‌‍ను తన స్థానానికి ఢోకా లేకుండా చేసుకున్నాడు. కాబట్టి గత మ్యాచ్‌లో విఫలమైన ఇషాన్ కిషన్‌ లేదా సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడే అవకాశముంది. సీనియర్ ప్లేయరైన సూర్యకుమార్‌కు మరో ఛాన్స్ ఇస్తే మాత్రం ఇషాన్‌ను తప్పకుండా పక్కన పెడతారు.

బౌలింగ్ విభాగంలో పెద్దగా మార్పులేమి ఉండకపోవచ్చు. అదనంగా మరో బ్యాటర్/స్పిన్నర్‌కు తీసుకోవాలంటే కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకుంటే ఉత్తమం. ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతే మాత్రం ఇదే జట్టులో హార్దిక్ పాండ్య కొనసాగుతాడు. అప్పుడు కూడా ఇషాన్ సద్వినియోగం చేసుకోకపోతే మరోసారి చోటు దక్కడం కష్టమేనని చెప్పవచ్చు.

ముంబయి వాంఖడే వేదికగా కంగారూ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 189 పరుగుల లక్ష్యాన్ని 39.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పీకల్లోతూ కష్టాల్లో ఉన్న భారత్‌ను కేఎల్ రాహుల్(75) తన అద్భుత అర్ధశతకంతో విజయాన్ని అందించాడు. రవీంద్ర జడేజా(45) సాయంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు స్టార్క్ 3 వికెట్లు తీయగా.. మార్కస్ స్టాయినీస్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్న జడ్డూకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.

టాపిక్