తెలుగు న్యూస్  /  Sports  /  Rohit Sharma Introduces Modi To Team India Cricketers

Pm Modi - Rohit Sharma: ప్రధాని మోదీకి టీమ్ ఇండియా క్రికెట‌ర్స్‌ను ప‌రిచ‌యం చేసిన రోహిత్ శర్మ

09 March 2023, 13:11 IST

  • Pm Modi - Rohit Sharma: అహ్మ‌దాబాద్ వేదిక‌గా గురువారం ఇండియా - ఆస్ట్రేలియా మ‌ధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభ‌మైంది. ఈ మ్యాచ్‌లో ప్ర‌ధాని మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్ట‌ర్ ఆంథోనీ ఆల్బ‌నీజ్ ఆట‌గాళ్ల‌తో క‌లిసి సంద‌డిచేశారు.

రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిల‌తో మోదీ
రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిల‌తో మోదీ

రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిల‌తో మోదీ

Pm Modi - Rohit Sharma: గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇండియా- ఆస్ట్రేలియా మ‌ధ్య‌ ప్రారంభ‌మైన నాలుగు టెస్ట్‌కు ప్ర‌ధాని మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్ట‌ర్ ఆంథోనీ ఆల్బ‌నీజ్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. ఇండియా - ఆస్ట్రేలియా మ‌ధ్య స్నేహ సంబంధాలు మొద‌లై 75 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా అహ్మ‌దాబాద్ టెస్ట్‌కు మోదీ, ఆల్బ‌నీజ్ హాజ‌ర‌య్యారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ప్ర‌త్యేకంగా సిద్ధం చేస‌న వాహ‌నంలో స్టేడియం మొత్తం క‌లియ‌తిరిగి అభిమానుల‌కు అభివాదం చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమ్ ఇండియా ఆట‌గాళ్ల‌తో క‌లిసి ప్ర‌ధాని మోదీ జాతీయ గీతం ఆల‌పించారు. ఆ త‌ర్వాత టీమ్ ఇండియా ఆట‌గాళ్లు ఒక్కొక్క‌రిని మోదీకి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ప‌రిచ‌యం చేశారు.

క్రికెట‌ర్లు అంద‌రికి షేక్ హ్యాండ్ ఇస్తూ వారితో స‌ర‌దాగా మోదీ ముచ్చ‌టించారు. టీమ్ ఇండియా క్రికెట‌ర్ల‌తో మోదీ స్టేడియంలో సంద‌డి చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలోవైర‌ల్‌గా మారాయి. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు మోదీ టెస్ట్ క్యాప్ అంద‌జేయ‌గా స్టీవ్ స్మిత్‌కు ఆంథోనీ ఆల్బ‌నీజ్ క్యాప్ ఇచ్చారు.

ఈ టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించ‌డానికి వ‌చ్చిన ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్ట‌ర్ ఆల్బ‌నీజ్‌ను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజ‌ర్ బిన్నీ స‌త్క‌రించ‌గా మోదీకి బీసీసీఐ సెక్క‌ట‌రీ జై షా జ్ఞాపిక అంద‌జేశారు. తొలిరోజు ఈ మ్యాచ్ వీక్షించ‌డానికి ల‌క్ష మందికిపైగా అభిమానులు హాజ‌రైన‌ట్లు స‌మాచారం.