తెలుగు న్యూస్  /  Sports  /  Ravi Shastri Says Shubman Gill Deserves A Chance To Play The Last Two Tests Against Australia

Ravi Shastri on Gill: శుబ్‌మన్ గిల్‌కు చివరి రెండు టెస్టులకు అవకాశమివ్వాలి.. రవిశాస్త్రీ స్పష్టం

28 February 2023, 15:07 IST

    • Ravi Shastri on Gill: టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ.. శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అతడికి ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు టెస్టుల్లో తప్పకుండా అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు.
శుబ్ మన్ గిల్
శుబ్ మన్ గిల్ (PTI)

శుబ్ మన్ గిల్

Ravi Shastri on Gill: ఆస్ట్రేలియాతో టీమిండియా మూడో టెస్టు సమయాత్తమవుతోంది. గత రెండు టెస్టుల్లో భారత్ 2-0 తేడాతో విజయాన్ని అందుకుని మూడో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. అయితే భారత జట్టులో పదే పదే విఫలమవుతున్న కేఎల్ రాహుల్ స్థానంపై మాత్రం సందిగ్ధత నెలకొంటుంది. ఫెయిల్ అవుతున్న కేఎల్ రాహుల్ స్థానంలో ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌కు అవకాశం కల్పించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ స్పందించారు. మిగిలిన రెండు టెస్టుల్లో గిల్‌కు ఆడే అవకాశం కల్పించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"ప్రస్తుతం గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడు స్కోర్ చేసినా లేదా చేయకపోయినా ఫామ్‌లో ఉన్నప్పుడు మెరిట్ సాధిస్తాడు. అతడికి అవకాశమివ్వాలి. ఆత్మవిశ్వాసంతో ఆడే ఆటగాడున్నప్పుడు అతడి నుంచి మెరుగైన ప్రదర్శనలు ఆశించవచ్చు. గిల్ జట్టులో ఆడకపోవడంపై అతడికి ఎందుకు అవకాశివ్వట్లేదని టీమ్‌లో వాళ్లు కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ను ఆడించాలి." అని రవిశాస్త్రీ స్పష్టం చేశారు.

"ఇండియన్ టాపార్డర్‌లో గిల్‌ను ఆడించాలని రవిశాస్త్రీ అభిప్రాయపడ్డారు. ఫర్ఫార్మెన్స్ చూసి ఛాన్స్ ఇవ్వాలని తెలిపారు. బోర్డుకు మీరు స్టిక్ అయి ఉంటే ఇదే అతడి పర్ఫార్మెన్స్. ఏ కోచ్‌కైనా ఇది కఠిన నిర్ణయమే. కొన్నిసార్లు ఆటగాడికి బ్రేక్ మెరుగ్గా ఉంటుంది. ఎందుంటే ఆటపై ఫోకస్ పెట్టి బలంగా తిరిగి రావచ్చు. ఇంగ్లాండ్‌పై పుజారాను తొలగించగా.. అతడు తిరిగి వచ్చాడు. కేఎల్ రాహుల్ 2019లో ఆస్ట్రేలియాపై సరిగ్గా రాణించలేదు. కానీ మళ్లీ బలంగా వచ్చాడు." అని రవిశాస్త్రీ అన్నారు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్ పెద్దగా రాణించలేదు. మరోపక్క యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన చివరగా బంగ్లాదేశ్‌తో టెస్టులో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో 208 పరుగులతో అదరగొట్టాడు. దీంతో ఫామ్‌లో ఉన్న గిల్‌ను ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో తీసుకోవాల్సిందిగా పలువురు సూచనలు చేస్తున్నారు.