తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravi Shastri On Rahul Dravid: కోచ్‌ ద్రవిడ్‌కు అన్ని బ్రేక్స్‌ ఎందుకు.. ఏం చేస్తాడు: రవిశాస్త్రి

Ravi Shastri on Rahul Dravid: కోచ్‌ ద్రవిడ్‌కు అన్ని బ్రేక్స్‌ ఎందుకు.. ఏం చేస్తాడు: రవిశాస్త్రి

Hari Prasad S HT Telugu

17 November 2022, 16:43 IST

    • Ravi Shastri on Rahul Dravid: కోచ్‌ ద్రవిడ్‌కు అన్ని బ్రేక్స్‌ ఎందుకు.. ఏం చేస్తాడు అంటూ మాజీ కోచ్‌ రవిశాస్త్రి ప్రశ్నించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ టూర్‌కు కూడా ద్రవిడ్‌కు రెస్ట్‌ ఇవ్వడంపై అతడు ఘాటుగా స్పందించాడు.
రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రి
రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రి (Getty Images)

రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రి

Ravi Shastri on Rahul Dravid: హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ అయిన తర్వాత తరచూ అతడు కొన్ని సిరీస్‌లకు దూరంగా ఉండటం, అతని స్థానంలో లక్ష్మణ్‌ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టడం సాధారణంగా మారిపోయింది. ఈ ఏడాది ఇప్పటికే ఐర్లాండ్‌, జింబాబ్వే, సౌతాఫ్రికాతో హోమ్‌ సిరీస్‌లకు ద్రవిడ్‌ దూరంగా ఉన్నాడు. ఐర్లాండ్‌ సమయంలో అతడు సీనియర్‌ టీమ్‌తో ఇంగ్లండ్‌లో ఉన్నాడు కాబట్టి సరే అనుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

కానీ మిగతా రెండు సిరీస్‌లు, ఇప్పుడు న్యూజిలాండ్ టూర్‌కు విశ్రాంతి ఇవ్వడంపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి మండిపడ్డాడు. తాను కోచ్‌గా ఉన్న సమయంలో రవిశాస్త్రి ఎప్పుడూ టీమ్‌తోనే ఉండేవాడు. ఒక్క సిరీస్‌కు కూడా మరొకరికి అవకాశం ఇవ్వలేదు. నిజానికి మరోసారి తాను కోచ్‌గా ఉండకూడదని నిర్ణయించుకోవడానికి కారణం కూడా అదే. కోచ్‌గా ఉంటే ఎప్పుడూ టీమ్‌తో కలిసి తిరగాల్సి ఉంటుంది.

అయితే ఇప్పుడు ద్రవిడ్‌కు తరచూ బ్రేక్స్‌ ఇవ్వడంపై మాత్రం రవిశాస్త్రి మండిపడ్డాడు. "బ్రేక్స్‌పై నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నేను నా టీమ్‌ను అర్థం చేసుకోవాలి. నా ప్లేయర్స్‌ను అర్థం చేసుకోవాలి. వాళ్లెప్పుడూ టీమ్‌ నియంత్రణలో ఉండాలి. నిజం చెప్పాలంటే ఎందుకిన్ని బ్రేక్స్‌? ఏం చేస్తారు? ఐపీఎల్‌ సమయంలో 2-3 నెలలు దొరుకుతుంది. అది చాలు. మిగతా సమయాల్లో కోచ్‌ ఎప్పుడూ అందుబాటులోనే ఉండాలి" అని శాస్త్రి స్పష్టం చేశాడు.

న్యూజిలాండ్‌ టూర్‌కు దూరంగా ఉన్న ద్రవిడ్‌.. మళ్లీ డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌ టూర్‌కు తిరిగి టీమ్‌తో చేరనున్నాడు. ఇక టీ20 క్రికెట్‌లో స్పెషలిస్ట్‌లు ఉండాల్సిందే అన్న లక్ష్మణ్‌ వాదనతో రవిశాస్త్రి ఏకీభవించాడు. ఐపీఎల్‌, సెకండ్‌ రేట్ ఇండియన్‌ టీమ్‌ ద్వారా అందుబాటులో ఉన్న టీ20 టాలెంట్‌ను ఉపయోగించుకోవాలన్న డిమాండ్‌ను కూడా శాస్త్రి సమర్థించాడు.

"నిజానికి చేయాల్సింది అదే. వీవీఎస్ చెప్పింది నిజమే. స్పెషలిస్టులను గుర్తించాలి. భవిష్యత్తులో అదే జరిగేది. అసలు భయం లేని ప్లేయర్స్‌ను తీసుకోవాలి. ఇప్పటి నుంచి రెండేళ్లలో ఇండియన్‌ టీమ్‌ను అద్భుతమైన ఫీల్డింగ్‌ టీమ్‌గా మార్చాలి. అసలు ఎలాంటి భారం లేకుండా స్వేచ్ఛగా ఆడే ప్లేయర్స్‌ ఉండాలి" అని రవిశాస్త్రి చెప్పాడు.

హార్దిక్‌కు కెప్టెన్సీ ఇస్తే మంచిదే

టీ20 క్రికెట్‌కు కొత్త కెప్టెన్‌ ఉంటే మంచిదే అని, అది హార్దిక్‌ అయినా సరే అని రవిశాస్త్రి అన్నాడు. "టీ20 క్రికెట్‌కు కొత్త కెప్టెన్‌ ఉండటంలో తప్పులేదు. ఇప్పుడు ఆడుతున్నంత క్రికెట్‌ను చూస్తుంటే ఏ ప్లేయర్‌కైనా మూడు ఫార్మాట్లు ఆడటం అంత సులువు కాదు. టెస్టులు, వన్డేల్లో రోహిత్‌ కెప్టెన్‌గా ఉంటే.. టీ20లకు కొత్త కెప్టెన్‌ అయినా సరే. అది హార్దిక్‌ పాండ్యా అయితే అలాగే కానివ్వండి" అని శాస్త్రి అన్నాడు.