తెలుగు న్యూస్  /  Sports  /  Rajeshwari Gayakwad Altercation With Super Market Staff In Bijapur Of Karnataka

Rajeshwari Gayakwad Altercation: సూపర్‌మార్కెట్‌లో మహిళా క్రికెటర్‌ హల్‌చల్‌.. స్టాఫ్‌పై ఫ్రెండ్స్‌తో కలిసి దాడి

Hari Prasad S HT Telugu

01 December 2022, 13:21 IST

    • Rajeshwari Gayakwad Altercation: సూపర్‌మార్కెట్‌లో మహిళా క్రికెటర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ హల్‌చల్‌ చేసింది. తన సన్నిహితులతో కలిసి అక్కడి స్టాఫ్‌పై దాడి చేయడం సంచలనం రేపింది.
రాజేశ్వరి గైక్వాడ్
రాజేశ్వరి గైక్వాడ్ (Action Images via Reuters)

రాజేశ్వరి గైక్వాడ్

Rajeshwari Gayakwad Altercation: ఇండియన్‌ వుమెన్స్‌ టీమ్‌ ప్లేయర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ ఇన్నాళ్లూ తన ఆటతోనే వార్తల్లో నిలిచింది. కానీ ఇప్పుడు పబ్లిగ్గా ఓ గొడవతో విమర్శల పాలవుతోంది. ఓ సూపర్‌ మార్కెట్‌లో మొదలైన చిన్న గొడవ పెద్దదిగా మారింది. చివరికి తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆ మార్కెట్‌ సిబ్బందిపై దాడి చేసే వరకూ వెళ్లింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

కర్ణాటకలోని విజయపుర (బీజాపూర్‌)లో ఈ ఘటన జరిగింది. ఈ గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ కూడా వైరల్‌ అవుతోంది. బీజాపూర్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో షాపింగ్‌కు వెళ్లిన రాజేశ్వరి అక్కడి సిబ్బందితో గొడవ పడింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే కాసేపటికే ఆమె సన్నిహితులు కొందరు మార్కెట్‌ వచ్చి సిబ్బందిపై దాడి చేశారు.

అక్కడి స్టాఫ్‌ దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను రిలీజ్ చేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలని భావించారు. అయితే ఆ తర్వాత రాజేశ్వరితోపాటు సూపర్‌ మార్కెట్‌ సిబ్బంది సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నారు. ఈ గొడవకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు.

రాజేశ్వరి గైక్వాడ్‌ టీమిండియా క్రికెటర్‌. ఆమె ఓ లెఫ్టామ్‌ స్పిన్నర్‌. 2014లో ఇండియా తరఫున శ్రీలంకపై తన తొలి వన్డే మ్యాచ్ ఆడింది. 2017లో వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్ చేరిన ఇండియన్‌ టీమ్‌లో రాజేశ్వరి కూడా సభ్యురాలిగా ఉంది. అదే వరల్డ్‌కప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కూడా చేసింది. వుమెన్స్‌ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ చరిత్రలో ఇండియా తరఫున అత్యుత్తమ గణాంకాలు (5/15) నమోదు చేసింది.

టాపిక్