తెలుగు న్యూస్  /  Sports  /  Rajapaksa Slams With Half Century Srilanka Set Target 171 Runs Against Pakistan In Asia Cup Final

PAK vs SA : రాజపక్స హాఫ్ సెంచరీ - ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్థాన్ టార్గెట్ 171

HT Telugu Desk HT Telugu

11 September 2022, 21:31 IST

  • PAK vs SA : ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్థాన్ పై శ్రీలంక 171 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. రాజపక్స, హసరంగ మినహా మిగిలిన బ్యాట్స్ మెన్స్ విఫలం కావడంతో శ్రీలంక మోస్తరు స్కోరు చేసింది. 

రాజపక్స
రాజపక్స (twitter)

రాజపక్స

PAK vs SA : ఆదివారం జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ లో (Asia cup final) తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. రాజపక్స 60 పరుగులు, హసరంగ 36 రన్స్ మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ రాణించలేకపోవడంతో శ్రీలంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

తొలి ఓవర్ లోనే ఫామ్ లో ఉన్న కుషాల్ మెండిస్ ను ఔట్ చేసి శ్రీలంకకు షాక్ ఇచ్చాడు పాకిస్థాన్ పేసర్ నసీమ్ షా. ఆ తర్వాత నిసాంక, గుణతిలక తక్కువ పరుగులకే ఔట్ కావడంతో 36 రన్స్ కే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది శ్రీలంక. ధనంజయ డిసిల్వాతో కలిసి రాజపక్స శ్రీలంకను గాడిన పెట్టాడు. డిసిల్వా 21 బాల్స్ లో నాలుగు ఫోర్లతో 28 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వహిందు హసరంగ, రాజపక్స కలిసి శ్రీలంక స్కోరును వంద పరుగులు దాటించారు.

హసరంగ 21 బాల్స్ లో ఒక సిక్సర్, ఐదు ఫోర్లతో 36 రన్స్ చేశాడు. చివర్లో కరుణ రత్నే నిలకడగా ఆడటంతో శ్రీలంక 170 రన్స్ చేసింది. రాజపక్ప 45 బాల్స్ లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 71 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3, నసీమ్ షా రెండు, షాబాద్ ఖాన్, అహ్మద్ తలో ఒక్క వికెట్ తీసుకున్నారు.

టాపిక్