తెలుగు న్యూస్  /  Sports  /  Psl 2023 Lahore Qalandars Beat Multan Sultans By One Run Wins Title

Psl Final 2023: ఒక ర‌న్ తేడాతో గెలిచి టైటిల్ ఎగ‌రేసుకుపోయిన లాహోర్ ఖ‌లంద‌ర్స్‌

19 March 2023, 10:14 IST

  • Psl Final 2023: పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ విజేత‌గా లాహోర్ ఖ‌లంద‌ర్స్ టీమ్ నిలిచింది. శ‌నివారం జ‌రిగిన ఫైన‌ల్‌లో ముల్తాన్ సుల్తాన్‌పై ఒక ప‌రుగు తేడాతో లాహోర్ విజ‌యాన్ని సాధించి టైటిల్ గెలుచుకుంది.

షాహీన్ అఫ్రిదీ
షాహీన్ అఫ్రిదీ

షాహీన్ అఫ్రిదీ

Psl Final 2023: పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్‌, లాహోర్ ఖ‌లంద‌ర్స్ మ‌ధ్య శ‌నివారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ చివ‌రి బాల్ వ‌ర‌కు ఉత్కంఠ‌ను రేకెత్తించింది. ఈ మ్యాచ్‌లో ఒక ప‌రుగు తేడాతో ముల్తాన్ సుల్తాన్స్‌పై నెగ్గిన లాహోల్ ఖ‌లంద‌ర్స్ టీమ్ టైటిల్ ఎగ‌రేసుకుపోయింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖ‌లంద‌ర్స్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 200 ప‌రుగులు చేసింది. ష‌ఫీక్ 40 బాల్స్‌లో రెండు సిక్స‌ర్లు, ఎనిమిది ఫోర్ల‌తో 64 ప‌రుగులు చేయ‌గా చివ‌ర‌లో పేస‌ర్ షాహీన్ అఫ్రిదీ బ్యాటింగ్ మెరుపుల‌తో ఆక‌ట్టుకున్నాడు. 15 బాల్స్‌లోనే ఐదు సిక్స‌ర్లు, రెండు ఫోర్ల‌తో 44 ప‌రుగులు చేశాడు. అత‌డి జోరులో లాహోర్ ఖ‌లంద‌ర్స్ భారీ స్కోరు చేసింది.

ల‌క్ష్య‌ఛేద‌న‌ను ధాటిగానే ఆరంభించింది ముల్తాన్ సుల్తాన్స్‌. మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (34 ర‌న్స్‌), రూసో (32 బాల్స్‌లో ఏడు ఫోర్లు రెండు సిక్స‌ర్ల‌తో 52 ర‌న్స్‌) బ్యాట్ ఝులిపించ‌డంతో ముల్తాన్ సుల్తాన్ సులువుగానే ల‌క్ష్యాన్ని ఛేదించేలా క‌నిపించింది.

కానీ బౌలింగ్‌లో విజృంభించిన షాహిన్ వ‌రుస‌గా నాలుగు వికెట్లు తీయ‌డంతో విజ‌యం ముగింట ముల్తాన్ సుల్తాన్ బోల్తా కొట్టింది. చివ‌రి ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు అవ‌స‌రం కాగా కేవ‌లం ప‌ద‌కొండు ర‌న్స్ మాత్ర‌మే చేసి ఒక ప‌రుగు తేడాతో టైటిల్ కోల్పోయింది.

ముల్తాన్ సుల్తాన్‌ను గెలిపించ‌డానికి ఖుష్‌దిల్‌షా (12 బాల్స్‌లో 25 ర‌న్స్‌) అబ్బాస్ అఫ్రిది (6 బాల్స్‌లో 17 ర‌న్స్‌) చివ‌రి వ‌ర‌కు పోరాడారు. చివ‌రి ఓవ‌ర్‌లో ఖుష్‌దిల్ ఔట్ కావ‌డంతో ముల్తాన్ ఓట‌మి త‌ప్ప‌లేదు.