తెలుగు న్యూస్  /  Sports  /  Pakistan Won The Toss Chose To Bat First Against South Africa

PAK vs SA T20 World Cup 2022: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ - గాయంతో మిల్ల‌ర్ దూరం

03 November 2022, 13:08 IST

  • PAK vs SA T20 World Cup 2022: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నేడు సౌతాఫ్రికాతో కీల‌క పోరుకు పాకిస్థాన్ సిద్ధ‌మైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. సౌతాఫ్రికాపై గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్ ఆశ‌లు స‌జీవంగా ఉంటాయి.

పాకిస్థాన్ వ‌ర్సెస్ సౌతాఫ్రికా
పాకిస్థాన్ వ‌ర్సెస్ సౌతాఫ్రికా

పాకిస్థాన్ వ‌ర్సెస్ సౌతాఫ్రికా

PAK vs SA T20 World Cup 2022: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నేడు పాకిస్థాన్‌, సౌతాఫ్రికా మ‌ధ్య కీల‌క మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

పాకిస్థాన్ సెమీస్ ఆశ‌లు స‌జీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్ గెల‌వ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెల‌వాల‌ని పాక్ ప్ర‌ణాళిక‌లు వేస్తోంది. మ‌రోవైపు పాకిస్థాన్‌పై గెలిచి సెమీస్ బెర్త్‌ను క‌న్ఫార్మ్ చేసుకోవాల‌ని సౌతాఫ్రికా బ‌రిలో దిగుతోంది.

పాకిస్థాన్‌కు కెప్టెన్ బాబ‌ర్ ఆజాం ఫామ్ ఇబ్బందిక‌రంగా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మ్యాచ్‌లో బాబార్ రాణించ‌లేదు. ఇప్ప‌టికే ఓట‌ముల‌తో డీలా ప‌డిన పాకిస్థాన్‌కు స్టార్ ప్లేయ‌ర్ ఫ‌క‌ర్ జ‌మాన్ గాయంతో దూరం కావ‌డంతో పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది. అత‌డి మ‌హ‌మ్మ‌ద్ హ‌రీస్ వ‌చ్చాడు. మ‌రోవైపు మార్‌క్ర‌మ్‌, రూసో వంటి హిట్ట‌ర్ల‌తో సౌతాఫ్రికా బ్యాటింగ్ లైన‌ప్ బ‌లంగా ఉంది. వారు చెల‌రేగితే పాకిస్థాన్‌కు క‌ష్టాలు త‌ప్ప‌వు.

గాయం కార‌ణంగా ఈ మ్యాచ్‌కు హిట్ట‌ర్ డేవిడ్ మిల్ల‌ర్ దూర‌మ‌య్యాడు. అత‌డి స్థానంలో క్లాసెన్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు. కేశ‌వ్ మ‌హ‌రాజ్ స్థానంలో షంసీ టీమ్‌లోకి వ‌చ్చాడు.