తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pak Vs Ned: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బోణీ చేసిన పాకిస్థాన్ - నెద‌ర్లాండ్స్‌పై ఈజీ విక్ట‌రీ

PAK vs NED: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బోణీ చేసిన పాకిస్థాన్ - నెద‌ర్లాండ్స్‌పై ఈజీ విక్ట‌రీ

30 October 2022, 15:51 IST

  • PAK vs NED: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాకిస్థాన్ బోణీ చేసింది. ఆదివారం ప‌సికూన నెద‌ర్లాండ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజ‌యాన్ని సాధించింది.

పాకిస్థాన్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్‌
పాకిస్థాన్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్‌

పాకిస్థాన్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్‌

PAK vs NED: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా ఆదివారం నెద‌ర్లాండ్స్‌పై పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెద‌ర్లాండ్స్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 91 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 13.5 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి పాకిస్థాన్ 95 ప‌రుగుల‌తో విజ‌యాన్ని అందుకున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్స్‌లో అకేర్‌మ‌న్ 27 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఎడ్వ‌ర్డ్స్ 15 ర‌న్స్ చేశాడు. వీరిద్ద‌రు మిన‌హా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అంద‌రూ సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. పాకిస్థాన్ బౌల‌ర్ల‌లో షాబాద్ ఖాన్ మూడు, మ‌హ్మ‌ద్ వాసిమ్ జూనియ‌ర్ 2 వికెట్లు తీశారు.

92 ప‌రుగులు ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన పాకిస్థాన్‌కు తొలి బాల్‌ఫోర్ కొట్టి దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు రిజ్వాన్‌. మ‌రోసారి త‌న విఫ‌ల ఫామ్‌ను కొన‌సాగిస్తూ కెప్టెన్ బాబ‌ర్ అజామ్ 4 ర‌న్స్‌కు ర‌నౌట్ అయ్యాడు. రిజ్వాన్‌, ఫ‌క‌ర్ జ‌మాన్ క‌లిసి మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఆడారు. కానీ ఇర‌వై ప‌రుగులు చేసిన ఫ‌క‌ర్ జ‌మాన్‌ను గ్లోవ‌ర్ ఔట్ చేశాడు. రిజ్వాన్‌, షాన్ మ‌సూద్ క‌లిసి పాకిస్థాన్‌ను విజ‌యం వైపు న‌డిపించారు.

హాఫ్ సెంచ‌రీకి ఒక ప‌రుగు దూరంలో రిజ్వాన్ ఔట‌య్యాడు. 39 బాల్స్‌లో ఐదు ఫోర్ల‌తో 49 ర‌న్స్ చేశాడు. గెలుపు ముంగిట షాన్ మ‌సూద్ కూడా ఔట‌య్యాడు. 13.5 ఓవ‌ర్ల‌లో పాకిస్థాన్ విజ‌యాన్ని అందుకున్న‌ది నెద‌ర్లాండ్స్‌ బౌల‌ర్ల‌లో గ్లోవ‌ర్‌కు రెండు వికెట్లు ద‌క్కాయి.