తెలుగు న్యూస్  /  Sports  /  New Zealand Batter Martin Guptill Again Becomes Highest Run Scorer In T20is

Martin Guptill World Record: మార్టిన్‌ గప్టిల్‌ వరల్డ్‌ రికార్డ్‌.. రోహిత్‌ రికార్డు బ్రేక్‌

Hari Prasad S HT Telugu

15 August 2022, 17:07 IST

    • Martin Guptill World Record: టీ20ల్లో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ మార్టిన్‌ గప్టిల్‌ వరల్డ్‌ రికార్డు క్రియేట్‌ చేశాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రికార్డును బ్రేక్‌ చేశాడు.
న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్
న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ (AP)

న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్

కింగ్స్‌టన్‌: టీ20ల్లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రికార్డు బ్రేక్‌ అయింది. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ అతని రికార్డు బ్రేక్‌ చేశాడు. ఆదివారం రాత్రి వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 15 రన్స్‌ చేసిన రోహిత్‌.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం గప్టిల్‌లో 3497 రన్స్‌తో టాప్‌లో ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

నిజానికి ఈ మధ్య వెస్టిండీస్‌తోనే జరిగిన తొలి టీ20లో 64 రన్స్‌ చేసిన రోహిత్‌ శర్మ.. గప్టిల్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇప్పుడు గప్టిల్‌ అదే ప్రత్యర్థిపై మళ్లీ రోహిత్‌ను వెనక్కి నెట్టడం విశేషం. రోహిత్‌ 3487 రన్స్‌తో రెండోస్థానంలో, విరాట్‌ కోహ్లి 3308 రన్స్‌తో మూడోస్థానంలో ఉన్నారు. అయితే రానున్న ఆసియా కప్‌లో మరోసారి గప్టిల్‌ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం రోహిత్‌తోపాటు కోహ్లికి కూడా ఉంది.

గప్టిల్‌ రికార్డు క్రియేట్‌ చేసిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ మాత్రం ఓడిపోయింది. వెస్టిండీస్‌ తరఫున ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్స్‌,షమార్‌ బ్రూక్‌ సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌ నెలకొల్పడంతో విండీస్‌ 8 వికెట్లతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ కాకుండా కాపాడుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 7 వికెట్లకు 145 రన్స్‌ మాత్రమే చేసింది.