తెలుగు న్యూస్  /  Sports  /  Mohammed Shami May Miss The Flight For T20 World In Australia Says A Report

Mohammed Shami: టీ20 వరల్డ్‌కప్‌లో మహ్మద్‌ షమీకి నో ఛాన్స్‌!

Hari Prasad S HT Telugu

29 June 2022, 20:53 IST

    • Mohammed Shami: ఇండియన్‌ టీమ్‌ ప్రధాన పేస్‌బౌలర్లలో ఒకడైన మహ్మద్‌ షమీకి టీ20 వరల్డ్‌కప్‌లో చోటు దక్కే అవకాశం లేదా? టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతన్ని కనీసం పరగణనలోకి కూడా తీసుకోవడం లేదా?
మహ్మద్ షమి
మహ్మద్ షమి (ANI)

మహ్మద్ షమి

న్యూఢిల్లీ: ఇండియాలోనే కాదు టీమిండియా ఏ టూర్‌కెళ్లినా పేస్‌ బౌలింగ్‌ భారాన్ని బుమ్రాతో కలిసి పంచుకునేది మహ్మద్‌ షమీనే. ఏ ఫార్మాట్‌ అయినా తన పేస్‌తో ప్రత్యర్థిని గడగడలాడించే సత్తా ఉన్న బౌలర్‌ అతడు. అయితే అలాంటి బౌలర్‌ను టీ20 వరల్డ్‌కప్‌కు పక్కన పెట్టాలని టీమిండియా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐలో వచ్చిన రిపోర్ట్‌ ప్రకారం.. వరల్డ్‌కప్‌కు టీమ్‌ అతన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లోనూ బుమ్రా, షమి టీమిండియా పేస్‌ బౌలింగ్‌ అటాక్‌లో కీలకంగా వ్యవహరించారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటన్స్‌ తరఫున ఆడిన షమి.. ఆ టీమ్‌ టైటిల్‌ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో 20 వికెట్లు తీసుకున్నాడు. 2021లో 19 వికెట్లు, 2020లో 20 వికెట్లు తీశాడు. ఆ లెక్కన టీ20ల్లో అతని ప్రదర్శన నిలకడగానే ఉంది.

అయినా ఆస్ట్రేలియాలో జరగబోతున్న టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం భువనేశ్వర్‌, బుమ్రాలే టీమ్‌ పేస్‌ బౌలింగ్‌ను లీడ్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. టీ20 ఫార్మాట్‌కు షమి ఫిట్‌ కాడని సెలక్టర్లు భావిస్తున్నట్లు ఆ రిపోర్ట్ వెల్లడించింది. "టీ20 వరల్డ్‌కప్‌ కోసం సెలక్టర్లు షమి పేరును పరిశీలించడం లేదు. అతడు ఈ ఫార్మాట్‌కు ఫిట్‌ కాడని వాళ్లు భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలో వరల్డ్‌కప్‌కు ముందు యువ బౌలర్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నారు. సీనియర్‌ బౌలర్‌గా భువనేశ్వర్‌ను ఎంపిక చేసినా.. షమీకి మాత్రం ఈసారి అవకాశం దక్కకపోవచ్చు" అని బోర్డు వర్గాలు వెల్లడించినట్లు ఏఎన్‌ఐ తన రిపోర్ట్‌లో చెప్పింది.