తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Mark Boucher On Rohit Sharma: రోహిత్‌ శర్మకు కోచింగ్‌ ఇవ్వడం ఆసక్తికరంగా ఉంటుంది: మార్క్‌ బౌచర్‌

Mark Boucher on Rohit Sharma: రోహిత్‌ శర్మకు కోచింగ్‌ ఇవ్వడం ఆసక్తికరంగా ఉంటుంది: మార్క్‌ బౌచర్‌

Hari Prasad S HT Telugu

22 December 2022, 13:54 IST

    • Mark Boucher on Rohit Sharma: రోహిత్‌ శర్మకు కోచింగ్‌ ఇవ్వడం ఆసక్తికరంగా ఉంటుందని అన్నాడు ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌. వచ్చే సీజన్‌ నుంచి అతడు ముంబైకి కోచ్‌గా ఉండనున్న విషయం తెలిసిందే.
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్

ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్

Mark Boucher on Rohit Sharma: ఐదుసార్లు ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ రాబోయే సీజన్‌లో రోహిత్‌కు కోచింగ్‌ ఇవ్వనుండటంపై స్పందించాడు. అతనికి కోచింగ్‌ అనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోందని, రోహిత్‌తో కూర్చొని మాట్లాడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు బౌచర్‌ తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఇన్నాళ్లూ ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌గా మహేల జయవర్దనె గ్లోబల్‌ టీమ్‌లోకి వెళ్లడంతో అతని స్థానంలో మార్క్‌ బౌచర్‌ను కొత్త కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా టీమ్‌కు కోచ్‌గా ఉన్న అతడు.. టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కు హెడ్‌ కోచ్‌గా ఉండటంపై ఆ టీమ్‌ అధికారిక వెబ్‌సైట్‌తో మాట్లాడాడు.

"రోహిత్‌కు కోచింగ్‌ ఇవ్వడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. రోహిత్‌తో కలిసి ఆడాను. అతడో అద్భుతమైన ప్లేయర్‌, గొప్ప లీడర్‌ కూడా. అందుకే అతనితో కూర్చొని మాట్లాడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నా. మా ఇద్దరిలో ఒకటి, రెండు విషయాలు ఒకేలా ఉన్నాయి. అతనికి సంభాషణ అంటే ఇష్టం. అందువల్ల రోహిత్‌తో మాట్లాడటం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నేను కోచింగ్‌ ఇచ్చే పద్ధతిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని రోహిత్‌తో చర్చిస్తా" అని బౌచర్‌ చెప్పాడు.

వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ టీమ్‌పై అంచనాల గురించి కూడా బౌచర్‌ స్పందించాడు. తాను ఫలితాలను మాత్రమే చూసే కోచ్‌నని, ప్లేయర్స్‌ కచ్చితంగా బాగా ఆడాల్సిందేనని స్పష్టం చేశాడు. "అంచనాలు ఎప్పుడూ ఉంటాయి. వరల్డ్‌ స్పోర్ట్‌లోని బెస్ట్‌ ఫ్రాంఛైజీల్లో ఇదీ ఒకటి. ఇది బాధ్యతను మరింత పెంచుతుంది. నేను ఫలితాల ఆధారంగా పని చేస్తాను. అందుకే నేనూ సరిగా పని చేయాలి. ప్లేయర్స్‌ కూడా సరిగా ఆడాలి. ఈ సవాలు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని బౌచర్‌ తెలిపాడు AB.

టాపిక్