తెలుగు న్యూస్  /  Sports  /  Manika Batra Wins Bronze Medal In Asian Cup Table Tennis 2022 Tournament

Manika Batra Won Bronze Medal: ఆసియా క‌ప్‌లో మనికా బ‌త్రా సంచ‌ల‌నం - బ్రాంజ్ మెడ‌ల్ సొంతం

19 November 2022, 20:27 IST

  • Manika Batra Won Bronze Medal: ఆసియా క‌ప్ టేబుల్ టెన్నిస్‌లో ఇండియ‌న్ ప్లేయ‌ర్ మ‌నికా బాత్రా బ్రాంజ్ మెడ‌ల్ సొంతం చేసుకున్న‌ది. ఈ ఘ‌న‌త‌ను సాధించిన ఫ‌స్ట్ ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా రికార్డ్ సృష్టించింది.

మ‌నికా బాత్రా
మ‌నికా బాత్రా

మ‌నికా బాత్రా

Manika Batra Won Bronze Medal: ఆసియా క‌ప్ టేబుల్ టెన్నిస్‌లో ఇండియ‌న్ ఉమెన్స్ ప్లేయ‌ర్ మ‌నికా బ‌త్రా సంచ‌ల‌నం సృష్టించింది. బ్రాంజ్ మెడ‌ల్ సొంతం చేసుకొని ఈ ఘ‌న‌త‌ను సాధించిన తొలి ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా నిలిచింది. శ‌నివారం జ‌రిగిన బ్రాంజ్ మెడ‌ల్ మ్యాచ్‌లో వ‌ర‌ల్డ్ సిక్త్స్‌ ర్యాంక‌ర్‌ మూడు సార్లు ఆసియా ఛాంపియ‌న్ హిన హ‌య‌త‌పై మ‌నికా బాత్రా విజ‌యాన్ని అందుకున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ గెలుపుతో ఐటీటీఎఫ్ - ఏటీటీయూ ఆసియా క‌ప్‌లో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన ఫ‌స్ట్ ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్‌లో మ‌నికా, హిన హ‌య‌తా గెలుపు కోసం హోరాహోరీగా పోరాడారు.

11 -6, 6 -11, 11-7, 12-10, 4-11, 11 -2 తేడాతో హిన హ‌య‌తాను మ‌నికా ఓడించింది. ఆసియా క‌ప్ ఫ‌స్ట్ రౌండ్‌లో వ‌ర‌ల్డ్ ఏడో నంబ‌ర్ ర్యాంక‌ర్‌పై అద్భుత విజ‌యాన్ని సాధించి ప్ర‌శంస‌లు అందుకున్న‌ది మ‌నికా.

అస‌మాన విజ‌యాల‌తోసెమీస్ చేరుకున్న‌ది. కానీ సెమీఫైన‌ల్‌లో మిమా ఇటో చేతిలో ప‌రాజ‌యం పాలైంది. ఆ ఓట‌మి నుంచి తేరుకొని బ్రాంజ్ మెడ‌ల్ మ్యాచ్‌లో స‌త్తా చాటింది.

టాపిక్