తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Fights : ఐపీఎల్ చరిత్రలో టాప్ 9 బిగ్గెస్ట్ ఫైట్స్ ఇవే

IPL Fights : ఐపీఎల్ చరిత్రలో టాప్ 9 బిగ్గెస్ట్ ఫైట్స్ ఇవే

HT Telugu Desk HT Telugu

04 May 2023, 11:37 IST

google News
    • IPL 2023 : ఐపీఎల్ లో అప్పుడప్పుడు కొన్ని ఘటనలు జరుగుతాయి. చాలా రోజులపాటు గుర్తుండిపోతాయి. ఇటీవల కోహ్లీ-గంభీర్ మధ్య వివాదం కూడా అలాంటిదే. ఇలాంటివి ఐపీఎల్ చరిత్రలో చాలానే ఫైట్స్ జరిగాయి.
శ్రీశాంత్ ని చెంపదెబ్బ కొట్టిన హర్భజన్
శ్రీశాంత్ ని చెంపదెబ్బ కొట్టిన హర్భజన్

శ్రీశాంత్ ని చెంపదెబ్బ కొట్టిన హర్భజన్

చిన్న చిన్న గొడవలు, ఆటపై నియంత్రణ కోల్పోవడం వంటివి క్రికెట్లో జరుగుతాయి. క్రికెటర్లు మాటలు అనుకోవడం, స్లెడ్జింగ్, చిన్న చిన్న తగాదాలు తరచుగా చూస్తుంటాం. ఇటీవల కోహ్లీ వర్సెస్ గంభీర్ ఫైట్(Kohli Vs Gambhir Fight) కూడా అలాంటిదే. అయితే ఇది ఎక్కువగా వైరల్ అయింది. ఐపీఎల్ చరిత్రలో కొన్ని హీట్ మూమెంట్స్ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూడండి.

శ్రీశాంత్ Vs హర్భజన్ సింగ్ – MI Vs KXIP 2008లో

శ్రీశాంత్ వర్సెస్ హర్భజన్ సింగ్(harbhajan singh) ఫైట్. ఇది అప్పట్లో తెగ వైరల్ అయింది. భజ్జీ శ్రీశాంత్‌ని చెంపదెబ్బ కొట్టడంతో మాటల యుద్ధం ముగిసింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్భజన్, శ్రీశాంత్ మీద సహనం కోల్పోయాడు. అతనిని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో శ్రీశాంత్ ఏడ్చాడు.

2013లో గంభీర్ Vs కోహ్లీ – KKR Vs RCB

దూకుడు ఉన్న ఆటగాడిగా పేరొందిన విరాట్ కోహ్లీ(Virat Kohli) 2013లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్‌పై సహనం కోల్పోయాడు. క్రీజు నుండి నిష్క్రమించే సమయంలో గంభీర్.. కోహ్లీని ఉద్దేశించి కొన్ని మాటలు అనడంతో కోహ్లి నియంత్రణ కోల్పోయాడు. దీని ఫలితంగా తీవ్ర వాగ్వాదం జరిగింది. అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పారు.

2019లో MS ధోని Vs రాజస్థాన్ రాయల్స్, అంపైర్లు

అంపైర్ల నో బాల్ నిర్ణయం తర్వాత ధోనీ(Dhoni) గ్రౌండ్‌లో తొలిసారి సహనం కోల్పోయాడు. అంపైర్ల వద్దకు ధోనీ వెళ్లగా, RR ఆటగాడు బెన్ స్టోక్స్ కూడా చర్చలో చేరాడు. ఇది వాగ్వాదానికి దారితీసింది.

పొలార్డ్ Vs మిచెల్ స్టార్క్-MI Vs RCB 2014లో

మిచెల్ స్టార్క్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా లేనందున కీరన్ పొలార్డ్ నియంత్రణ కోల్పోయాడు. అతని బ్యాట్‌ను విసిరాడు. పొలార్డ్, స్టార్క్ మధ్య తీవ్రంగా వాగ్వాదం జరిగింది.

2016లో అంబటి రాయుడు Vs హర్భజన్ – MI Vs RPS

ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)కు చెందిన అంబటి రాయుడు, హర్భజన్ సింగ్‌ మధ్య వివాదం జరిగింది. రాయుడు ఫీల్డింగ్‌తో నిరాశపరిచాడని హర్భజన్ అరిచాడు. రాయుడు కూడా భజ్జీపై అరిచాడు.

సౌరవ్ గంగూలీ Vs షేన్ వార్న్ – 2008లో KKR Vs RR

2008లో KKR Vs RR మధ్య జరిగిన మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ(Ganguly) తన క్యాచ్ అవుట్ నిర్ణయంతో నిరాశ చెందాడు. అంపైర్‌లతో వాగ్వాదానికి దిగాడు. RR కెప్టెన్ షేన్ వార్న్ కూడా వచ్చి మాట్లాడాడు. అంపైర్ నిర్ణయంపై ఇద్దరి మధ్య వివాదం నడిచింది.

నితీష్ రానా Vs హృతిక్ షోకీన్ - KKR Vs ముంబై

ఇటీవలి ఎడిషన్‌లో KKR ఆటగాళ్ళు నితీష్ రాణా, హృతిక్ షోకీన్ ఫీల్డింగ్‌పై తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీనిలో షోకీన్ తన కెప్టెన్ పట్ల అసహనం ప్రదర్శించాడు.

2019లో కోహ్లీ Vs అశ్విన్ – RCB Vs KXIP

2019లో ఆర్‌ అశ్విన్‌, కోహ్లీ మధ్య మాటల యుద్ధం జరిగింది. కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు అశ్విన్. అశ్విన్‌ ఔట్‌ను కోహ్లి సంబరాలు చేసుకున్నాడు. దీంతో పెవిలియన్‌కు వెళ్లే ముందు కోహ్లీపై అశ్విన్ ఫైర్ అయ్యాడు.

2023లో కోహ్లీ Vs గంభీర్, నవీన్-ఉల్-హక్- RCB Vs LSG

ఇటీవల జరిగిన ఈ వివాదంపై ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. కోహ్లీ-గంభీర్ మధ్య వివాదం జరిగింది. ఎల్‌ఎస్‌జీ ఆటగాళ్లను ఔట్ చేసిన తర్వాత కోహ్లీ సెలబ్రేట్ చేసుకున్నాడు. మ్యాచ్ తర్వాత కోహ్లి Vs గంభీర్ తీవ్ర వాగ్వాదానికి దిగారు.

తదుపరి వ్యాసం